Site icon NTV Telugu

Vishwambhara: కీరవాణి ఉండగా భీమ్స్ స్పెషల్ సాంగ్.. ఎందుకో తెలుసా?

Chiru

Chiru

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. సంక్రాంతి సందర్భంగా సినిమా రిలీజ్ చేద్దామని కూడా అనుకున్నారు. గేమ్ చేంజర్ టీమ్ వాయిదా వేసుకోమని కోరడంతో సినిమా వాయిదా వేసినట్టు అప్పట్లో ప్రకటించారు. అయితే అసలు కారణం కంప్యూటర్ గ్రాఫిక్స్ లేట్ కావడంతోనే సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆ సంగతి అలా ఉంచితే, షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాకి ఇప్పుడు ఒక సరికొత్త సాంగ్ యాడ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి సరసన నాగిని ఫేమ్ మౌనీ రాయ్ ఈ మాస్ ఐటెం నంబర్‌లో ఆడి పాడింది.

READ MORE: Drone Missile: డ్రోన్ నుంచి మిస్సైల్ ప్రయోగం.. సత్తా చాటిన భారత్..

సినిమాలో మాస్ ఎలిమెంట్స్ కోసం ఈ పాట యాడ్ చేసి ఉంటారేమో అనుకోవచ్చు, కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆస్కార్ గ్రహీత కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తే, ఈ సాంగ్‌కి మాత్రం ప్రత్యేకంగా బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. అదేంటి, కీరవాణి ఉండగా బీమ్స్ చేత ఎందుకు సంగీతం ఇప్పించారు అనే ప్రశ్న అందరిలోనూ మొదలవుతుంది. అయితే అందుకు ప్రత్యేకమైన కారణాలు ఏవీ లేవని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో బీమ్స్ చేసిన చాలా పాటలు వైరల్ కావడం, సంక్రాంతి వస్తున్నాం సినిమాకి పాటే మంచి ప్రమోషన్ తీసుకురావడంతో పాటు, కీరవాణి అందుబాటులో లేకపోవడంతో భీమ్స్ చేత సాంగ్ చేయించినట్లు తెలుస్తోంది. కీరవాణి హరిహర వీరమల్లు రిలీజ్‌కి రెడీ కావడంతో, ఆ సినిమాకి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో బిజీగా ఉన్నాడని, సరిగ్గా అదే సమయంలో ఈ సాంగ్ చేయాల్సిన రావడంతో, కీరవాణి అనుమతి తీసుకుని బీమ్స్ చేత ఈ సాంగ్ చేయించారని తెలుస్తోంది. మొత్తం మీద ఈ సినిమాలో బీమ్స్ అందించిన ఈ సాంగ్ హైలైట్‌గా నిలవబోతోందని అంటున్నారు. చూడాలి మరి ఎంతవరకు కరెక్ట్ అవుతుందో.

Exit mobile version