Vishwambhara: కీరవాణి ఉండగా భీమ్స్ స్పెషల్ సాంగ్.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. సంక్రాంతి సందర్భంగా సినిమా రిలీజ్ చేద్దామని కూడా అనుకున్నారు. గేమ్ చేంజర్ టీమ్ వాయిదా వేసుకోమని కోరడంతో సినిమా వాయిదా వేసినట్టు అప్పట్లో ప్రకటించారు. అయితే అసలు కారణం కంప్యూటర్ గ్రాఫిక్స్ లేట్ కావడంతోనే సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆ సంగతి అలా ఉంచితే, షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాకి ఇప్పుడు ఒక సరికొత్త సాంగ్ యాడ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి సరసన నాగిని ఫేమ్ మౌనీ రాయ్ ఈ మాస్ ఐటెం నంబర్లో ఆడి పాడింది.
READ MORE: Drone Missile: డ్రోన్ నుంచి మిస్సైల్ ప్రయోగం.. సత్తా చాటిన భారత్..
Also Read
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
సినిమాలో మాస్ ఎలిమెంట్స్ కోసం ఈ పాట యాడ్ చేసి ఉంటారేమో అనుకోవచ్చు, కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆస్కార్ గ్రహీత కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తే, ఈ సాంగ్‌కి మాత్రం ప్రత్యేకంగా బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. అదేంటి, కీరవాణి ఉండగా బీమ్స్ చేత ఎందుకు సంగీతం ఇప్పించారు అనే ప్రశ్న అందరిలోనూ మొదలవుతుంది. అయితే అందుకు ప్రత్యేకమైన కారణాలు ఏవీ లేవని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో బీమ్స్ చేసిన చాలా పాటలు వైరల్ కావడం, సంక్రాంతి వస్తున్నాం సినిమాకి పాటే మంచి ప్రమోషన్ తీసుకురావడంతో పాటు, కీరవాణి అందుబాటులో లేకపోవడంతో భీమ్స్ చేత సాంగ్ చేయించినట్లు తెలుస్తోంది. కీరవాణి హరిహర వీరమల్లు రిలీజ్‌కి రెడీ కావడంతో, ఆ సినిమాకి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో బిజీగా ఉన్నాడని, సరిగ్గా అదే సమయంలో ఈ సాంగ్ చేయాల్సిన రావడంతో, కీరవాణి అనుమతి తీసుకుని బీమ్స్ చేత ఈ సాంగ్ చేయించారని తెలుస్తోంది. మొత్తం మీద ఈ సినిమాలో బీమ్స్ అందించిన ఈ సాంగ్ హైలైట్‌గా నిలవబోతోందని అంటున్నారు. చూడాలి మరి ఎంతవరకు కరెక్ట్ అవుతుందో.
తాజావార్తలు
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!