ఐపీఎల్ లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది ఆర్సీబీనే. గతంలో విరాట్ కోహ్లీ సారథ్యం వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తుంది. 17 ఏళ్లుగా టైటిల్ కరువులో ఉన్న ఆ జట్టు ప్రస్తుతం టేబుల్ టాప్2 లో కొనసాగుతుంది. అయితే కోహ్లీ ఢిల్లీ వాసి అయినప్పటికీ ఢిల్లీ తరఫున ఆడకుండా బెంగుళూరు తరఫున ఎందుకు ఆడుతున్నాడన్న డౌట్ రావొచ్చు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు అంటే 2008కి ముందు అండర్-19 ఆటగాళ్ల డ్రాఫ్ట్ లో ఉన్న విరాట్ కోహ్లీని ఢిల్లీ డేర్ డెవిల్స్ తీసుకోకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
READ MORE: IPL 2025: వాళ్లు ఐపీఎల్ అంపైర్స్ కాదు.. ముంబై అంపైర్స్!
వాస్తవానికి టీమిండియా అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన ప్లేయర్స్ ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఒక్కొక్కరిని తమ జట్టులో చేర్చుకున్నాయి. అయితే ఢిల్లీ జట్టు అండర్-19 కెప్టెన్ విరాట్ కోహ్లీని కాదని ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ప్రదీప్ సంగ్వాన్‌ను ఎంపిక చేసింది. ఇదే విషయంపై తాజాగా సెహ్వాగ్ మాట్లాడాడు.. “ఢిల్లీ జట్టులో చాలా మంది బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. మాకు బౌలర్ అవసరం కాబట్టి ప్రదీప్ సంగ్వాన్‌ను ఎంపిక చేశాం. జట్టులో అప్పటికే గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్, దిల్షాన్ లాంటి టాప్-ఆర్డర్ ఓపెనర్లు ఉన్నారు. ఎబి డివిలియర్స్ లాంటి బలమైన ఆటగాడు కూడా ఉండటంతో మేము బౌలర్ పై దృష్టి పెట్టాం” అని చెప్పాడు. కాగా ఆ సమయంలో సెహ్వాగ్ ఢిల్లీకి సారథ్యం వహించాడు.
READ MORE: GT vs SRH: మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్ రేసులో ఎస్ఆర్ఎచ్ నిలుస్తుందా? మొదట బ్యాటింగ్ చేయనున్న జీటి