Sukumar : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా కోసం రెండు స్టోరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రంగస్థలం’ వంటి హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ భారీ చిత్రం కోసం గ్రౌండ్ వర్క్ మాత్రం అత్యంత వేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, సుకుమార్ ఈ సినిమా కోసం ఏకంగా రెండు కథలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : NBK : నందమూరి బాలయ్య – వివేక్ ఆత్రేయ ఫిక్స్..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
సుకుమార్ సాధారణంగా తన స్క్రిప్ట్ వర్క్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈసారి రామ్ చరణ్ కోసం సరికొత్త పంథాలో ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా సుకుమార్ శిష్యుడు శ్రీ హుస్సేన్ షా కిరణ్ ఒక స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉండగా, సుకుమార్ తన వ్యక్తిగత టీమ్‌తో కలిసి గోవాలో మరొక కథపై కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు కథల్లో చరణ్ ఇమేజ్‌కు ఏది బాగా సెట్ అవుతుందో దానిని ఫైనల్ చేయనున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో కథను మరింతగా మెరుగుపరిచేందుకు ఆయన టీమ్ కథపై కసరత్తులు చేస్తోంది. సుకుమార్ మార్కు ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేకి, చరణ్ మాస్ అప్పీల్ తోడైతే మరో ‘రంగస్థలం’ మించిన మ్యాజిక్ రిపీట్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ పూర్తి చేసి బుచ్చిబాబు సినిమాతో బిజీగా ఉండగా, సుకుమార్ ‘పుష్ప 2’ పనుల్లో ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే చరణ్ – సుకుమార్ సినిమా పట్టాలెక్కనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..