ఏవండీ సీరియల్స్ వస్తున్నాయి టీవీ పెట్టండి. ఏరా నేను బొమ్మలు చూస్తా. బాబు ఐపీఎల్ మ్యాచ్ పెట్టరా.. ఇలా రోజు తరుచుగా జరిగే సంభాషణలు.. దేని కోసం టెలివిజన్ కోసం. పొద్దున లేచినప్పటి నుంచి మొదలుపెడితే.. రాత్రి పడుకునే వరకు టీవీ నాన్ స్టాప్ రన్నింగ్. అయితే ఇప్పుడు ఈ టీవీ మ్యాటర్ ఏంటటరా.. టీవీ చూస్తున్నప్పడు.. ఒక్కటి మాత్రం గమనించరు. ఏంటంటే.. టీవీ స్క్రీన్ నల్లగా ఉండటం. అసలు ఈ డౌట్ ఇప్పడు ఎందుకు వచ్చింది. టీవీ స్క్రీన్ నల్లగానే ఎందుకు ఉంటుంది. వేరే రంగుల్లో ఎందుకు ఉండదని అనిపించిందా… ఆన్ చేసినప్పుడు..ఆఫ్ చేసినప్పుడు నల్లగానే ఎందుకు మారిపోతుందో తెలుసా..దీనికి సమాధానం తెలుసుకుందాం..
Read Also: TSPSC: మరో 13 మంది అభ్యర్థులను డిబార్ చేసిన టీఎస్పీఎస్సీ
టీవీ నల్లగా ఉండటానికి కారణమేంటంటే.. స్క్రీన్ ఆఫ్ చేసినప్పుడు సాధారణంగా నలుపు రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే డిస్‌ప్లే బ్యాక్‌లైట్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి. కొన్ని టీవీల స్క్రీన్‌లు ఆఫ్ చేసినప్పుడు.. నీలం( బ్లూ) లేదా ఎరుపు (రెడ్) రంగులు కనిపిస్తాయి. దీనికి కారణం టీవీలోని సెట్టింగ్స్. టీవీ స్క్రీన్ నల్లగా కాకుండా మరో కలర్లోకి మార్చాలంటే మన చేతుల్లో పనే.. సెట్టింగ్ లోకి వెళ్లి కలర్ ను మార్చుకోవచ్చు. అయితే అన్ని టీవీలకు ఈ ఫెసిలిటీ ఉండదు. కొన్ని టీవీలకు మాత్రమే అవకాశం ఉంటుంది.. అలా చేస్తున్నప్పుడు సెట్టింగ్స్ కు సంబంధించి యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.
Read Also: Ahmednagar: అహ్మద్‌నగర్ పేరును అహల్యానగర్‌గా.. మహారాష్ట్ర సీఎం ప్రకటన
టీవీ స్క్రీన్ నల్లగా ఉండటానికి కారణం ఏంటనే ప్రశ్నకు తమదైన శైలిలో ఆన్సర్లిస్తున్నారు కొందరు వినియోగదారులు. టీవీ ఆఫ్ చేసినప్పుడు స్క్రీన్ లైట్ కూడా ఆఫ్ అయిపోతుందని..ఆ సమయంలో పిక్సెల్ నుంచి కాంతి విడుదల చేసే CRT,OLED, ప్లాస్మా స్క్రీన్ లు పూర్తిగా స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోతాయని చెబుతున్నారు. అందుకే అవి నల్లగా మారిపోతాయంటున్నారు. సాధారణంగా టీవీ స్క్రీన్ లపై ఉండే అద్దం నల్లగా ఉండటం వల్ల టీవీ ఆఫ్ అయిపోయినప్పుడు స్క్రీన్ కూడా నల్లగా మారుతుందంటున్నారు. ఇలా టీవీ స్క్రీన్ నల్లగా ఉండటంపై కారణాలను వెతుకుతున్నారు కొందరు.