Punjab: అమృత్సర్లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
- అమృత్సర్లో దారుణం
- డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
- ఇద్దరు నిందితుల కోసం గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడంతో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI) మృతి చెందారు. అమృత్సర్లోని భగ్తావాలా ధాన్యం మార్కెట్లో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ASI హర్జీత్ సింగ్ భగ్తావాలా గ్రెయిన్ మార్కెట్లో విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై పాయింట్-బ్లాంక్ రేంజ్లో పలుమార్లు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హర్జీత్ సింగ్ను వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్పులు జరిపిన ఇద్దరు దుండగుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఘటనకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతి చెందిన ASI హర్జీత్ సింగ్ తర్న్ తరన్ జిల్లాకు చెందినవారని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!