Friendship Day 2024: ప్రతేడాది ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్ షిప్ డే జరుపుకుంటారు. ఫ్రెండ్ షిప్ డే అనేది ప్రతి ఒక్కరూ స్నేహితులతో వారి బంధాన్ని ఆస్వాదించడానికి ఒక సందర్భం. ఇది జీవితంలోని కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. ఆరోజు అందరూ తమ స్నేహితులపై తమ ప్రేమను వ్యక్తపరచడానికి కార్డులు, ఫ్రెండ్ షిప్ బ్యాండ్‌లు ఇచ్చుపుచ్చుకుంటారు. స్నేహానికి వయసు, కులము, మతము అనే బేధాలు ఉండవు. నిజమైన స్నేహితులు కష్ట సమయాల్లోనూ మనకు తోడుగా ఉంటారు. స్నేహితుడులోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు. స్నేహితులు చేసిన తప్పులను గురువులా బోధించే వాడే స్నేహితుడు.
1935 లో యునైటెడ్ స్టేట్ కాంగ్రెస్ ఆగస్ట్ మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్ షిప్ డేగా ప్రకటించింది. మనదేశంలో ప్రతి ఏడాది ఆగస్ట్ మొదటి ఆదివారం ఫ్రెండ్ షిప్ డే ను జరుపుకుంటారు. ప్రపంచం మొత్తం ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నప్పటికీ, దేశాన్ని బట్టి తేదీ మారుతుంది. ఐక్యరాజ్యసమితి జూలై 30ని ఫ్రెండ్ షిప్ డేగా ప్రకటించింది. కానీ మనదేశంలో మాత్రం ఆగస్ట్ నెలలో వచ్చే మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. హాల్మార్క్ కార్డ్స్ వ్యవస్థాపకుడు హిస్టరీ జాయిస్ హాల్ స్నేహానికి కృతజ్ఞత తెలియజేయడానికి ఒక రోజును కేటాయించాలని ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి జూలై 30ని ఇంటర్నేషన్ ఫ్రెండ్ షిప్ డేగా ప్రకటించడంతో ఫ్రెండ్ షిప్ సెలబ్రేషన్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.
Read Also:Crime News: వృద్ధుడి దారుణ హత్య.. రాళ్లు, కర్రలతో దాడి చేసిన ప్రత్యర్థులు
దేశాలు, సంస్కృతులు, వ్యక్తుల మధ్య స్నేహం శాంతి ప్రయత్నాలకు ఇది స్ఫూర్తినిస్తుందని, సమాజాల మధ్య వారధులను నిర్మించగలదనే ఆలోచనతో 2011లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, స్నేహం, దాని ప్రాముఖ్యత గురించి ప్రజల మధ్య సంభాషణను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు, దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, ఇతర సామాజిక సమూహాలను ఈవెంట్లు, పోటీలు, ఇతర కార్యకలాపాలను నిర్వహించమని ఐక్యరాజ్యసమితి ప్రోత్సహిస్తుంది. ఈ రోజు స్నేహితుల ప్రాముఖ్యతను, మన జీవితంలో వారు పోషిస్తున్న విలువైన పాత్రను గౌరవిస్తుంది. అలాగే గుర్తిస్తుంది. బంధాలను బలోపేతం చేయడానికి, స్నేహాలు తీసుకువచ్చే ఆనందాన్ని జరుపుకోవడానికి ఒక అవకాశంగా ఈ ఫ్రెండ్షిప్ డే పనిచేస్తుంది. ఈ రోజున, ప్రజలు సాధారణంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజున తన స్నేహితులకు ఇష్టమైన సందేశాలను పంపుతారు.
స్నేహితుల దినోత్సవం వల్ల వారి పట్ల కృతజ్ఞత, ఆప్యాయత, ప్రేమను చూపించేందుకు స్నేహితుల దినోత్సవం ఎంతో ముఖ్యమైనది. మనదేశంలో 1990లో గ్రీటింగ్ కార్డు కంపెనీలు ఫ్రెండ్షిప్ డేని ప్రాచుర్యంలోకి తెచ్చాయి. ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే కాన్సెప్ట్ ను మొదటగా 1958లో పరాగ్వేలో స్థాపించారు. అప్పటి నుంచి అన్ని దేశాలకు వ్యాపించింది. తరువాత దీని విలువను తెలుసుకున్న ఐక్యరాజ్య సమితి 2011లో దీన్ని అధికారికంగా గుర్తించింది. స్నేహ దినోత్సవం జాతీయ, సాంస్కృతిక సరిహద్దును దాటి విస్తరిస్తుంది. చిన్ననాటి స్నేహితులను మళ్లీ కనెక్ట్ అవ్వడానికి ఇదే మంచి సందర్భం. మధురమైన జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి కూడా స్నేహ దినోత్సవం ఒక అందమైన రోజు.
Read Also:Child Kidnapping: హైదరాబాద్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం.. వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు..