Manmohan Singh: మన్మోహన్ సింగ్ ఎందుకు ఆర్థిక వేత్త కావాలనుకున్నారు? ఆయన మాటల్లోనే..
- మాజీ ప్రధాని కన్నుమూత
- రెండుసార్లు ప్రధానిగా మన్మోహన్ సింగ్
- కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఊపిరిమ పోసిన మన్మోహన్
- ఆయన ఎందుకు ఆర్థిక వేత్త కావాలనుకున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
26 డిసెంబర్ 2024 రాత్రి.. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. దేశానికి రెండుసార్లు (2004-2014) ప్రధానమంత్రిగా పనిచేసిన సాటిలేని ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ తన 92వ ఏట తుది శ్వాస విడిచారు. ఆయన తీసుకొచ్చిన చాలా విధానాలు కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఊపిరి పోశాయి. అతలాకుతలమైన భారత ఆర్థిక వ్యవస్థకు పునర్జీవాన్ని అందించాయి. ప్రస్తుతం దేశం మొత్తం ఆయనకు భావోద్వేగంతో నివాళులు అర్పిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికే 7 రోజుల సంతాప దినాలు ప్రకటించింది. అయితే మన్మోహన్ సింగ్ ఆర్థిక మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ఆయన చెప్పిన సమాధానం గుర్తించి ఇప్పుడు చర్చిద్దాం..
READ MORE: Manmohan Singh: మన్మోహన్ సింగ్ పాలనలో ‘‘బెస్ట్ మూమెంట్’’, ‘‘అతిపెద్ద నిరాశ’’..
Also Read
- Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
- IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
దాదాపు 20 ఏళ్ల క్రితం, అమెరికన్ జర్నలిస్టు చార్లీ రోస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మన్మోహన్ సింగ్ ఆర్థిక శాస్త్రాన్ని ఎంచుకోవడానికి కారణాన్ని చెప్పారు. “నేను 15-16 సంవత్సరాల వయస్సు నుంచి.. నా చుట్టూ ఉన్న పేదరికాన్ని చూసి చాలా గందరగోళానికి గురయ్యాను. పాఠశాలలో మినూ మసాని రాసిన ‘మన భారతదేశం’ అనే పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకంలోని మొదటి వాక్యం నాకు ఇప్పటికీ గుర్తుంది. ‘చాలా మంది పేదలు నివసించే ధనిక దేశం భారతదేశం.’ అని మినూ మిసాని గారు పుస్తకంలో పేర్కొన్నారు. భారతదేశం ఎందుకు ఇంత పేద దేశంగా ఉందో నేను అర్థం చేసుకోవాలనుకున్నాను? ఇక్కడ ఇంత పేదరికం ఎందుకు ఉంది? ఈ కుతూహలమే నన్ను ఆర్థిక శాస్త్రం వైపు ఆకర్షించింది.” అని ఆయన సమాధానమిచ్చారు.
READ MORE: Lava Yuva 2 5G: చెప్పిన తేదీకి ముందే మార్కెట్లోకి వచ్చేసిన లావా స్మార్ట్ ఫోన్
అమృత్‌సర్‌లోని హిందూ కళాశాలలో చదివిన మన్మోహన్ సింగ్ ఆ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు.1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీతోపాటు 54లో పీజీ పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు. కేంబ్రిడ్జిలో చదువు పూర్తయ్యాక భారత్‌కు తిరిగి వచ్చి.. పంజాబ్ వర్సిటీలో అధ్యాపకుడిగా పని చేశారు. మళ్లీ ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లి అక్కడ పీహెచ్డీ పూర్తి చేశారు. ఇదిలా ఉండగా..1991లో భారతదేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. పివి నరసింహారావు హయాంలో ప్రసిద్ధ ఆర్థికవేత్త అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా ప్రభుత్వంలో చేర్చుకున్నారు. ఆ విధంగా మన్మోహన్ సింగ్, అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఇరువురు నేతలు కలిసి ఆర్థిక వ్యవస్థను చెల్లింపుల సంక్షోభం నుంచి గట్టెక్కించారు. ఆర్థిక సంస్కరణలకు పునాది వేశారు.
తాజావార్తలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!