భవిష్యత్తులో టీఎంసీ బాధ్యతలు చేపట్టనున్న మమతా బెనర్జీ వారసులు ఎవరు? ఈ ప్రశ్న పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తృణమూల్ కాంగ్రెస్ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లో కూడా ఈ ప్రశ్న పదే పదే లేవనెత్తుతోంది. ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. పార్టీలో సీనియర్ నేతలు, యువకుల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మమతా శుక్రవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్‌లో తన వారసుడు ఎవరన్న ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.
READ MORE: South Korea President: నన్ను క్షమించండి.. మరోసారి దేశంలో ఎమర్జెన్సీ విధించను!
ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తాను ఒంటరిగా తీసుకోనని స్పష్టం చేశారు. తదుపరి వారసుడు ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందని మమతా బెనర్జీ తెలిపారు. టీఎంసీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఎవరూ షరతులు విధించలేరని చెప్పారు. పార్టీలో ఎవ్వరు కూడా ఆధిపత్యం చెలాయించలేరని ఆమె వెల్లడించారు. ప్రజలకు ఏది మంచిదో పార్టీ నిర్ణయిస్తుందన్నారు. టీఎంసీకి చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, బూత్ వర్కర్లు ఉన్నారని.. అందరూ కలిసి దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కొత్త తరానికి అవకాశం కల్పిస్తామని.. పాత తరం నాయకులు కూడా ముఖ్యులే అన్నారు. నేటి యువత రేపు సీనియర్లు కాబట్టి మాకు, పార్టీకి ఇద్దరూ ముఖ్యమే అని చెప్పారు.
READ MORE:Urjaveer : ఇవాళ ఉర్జవీర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు