భవిష్యత్తులో టీఎంసీ బాధ్యతలు చేపట్టనున్న మమతా బెనర్జీ వారసులు ఎవరు? ఈ ప్రశ్న పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తృణమూల్ కాంగ్రెస్ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లో కూడా ఈ ప్రశ్న పదే పదే లేవనెత్తుతోంది. ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. పార్టీలో సీనియర్ నేతలు, యువకుల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మమతా శుక్రవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.
బెంగాల్ నుండి 4వేల మంది MNREGA కార్మికులతో సహా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు రైలులో ఢిల్లీకి బయల్దేరారు. అక్టోబర్ 2, 3 తేదీల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్నారు.