Site icon NTV Telugu

Vikram Misri: పాకిస్థాన్ చీకటి రహస్యాలను ప్రపంచానికి వెల్లడించిన విక్రమ్ మిస్రీ ఎవరు?

Vikram Misri1

Vikram Misri1

మే 6-7 రాత్రి.. ప్రపంచం మొత్తం నిద్రపోతోంది. భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడంలో బిజీగా ఉంది. 30 నిమిషాల ఆపరేషన్‌లో భారత సైన్యం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఉదయం వరకు దీని గురించి ఎవరికీ అధికారిక సమాచారం లేదు. ఇంతలో ఈ ఘటనపై సైన్యం, విదేశాంగ శాఖ సంయుక్త విలేకరుల సమావేశంలో సమాచారం అందించారు. సుమారు 10.30 గంటలకు ఒక వ్యక్తి విలేకరుల సమావేశంలో కనిపించారు. ఆయనతో పాటు భారత సైన్యంలోని ఇద్దరు మహిళా అధికారులు సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా వచ్చారు. ఆ వ్యక్తి వారిద్దరినీ పరిచయం చేసి భారతదేశం, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత గురించి సమాచారం అందించారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందాం..

READ MORE: Raghava Lawrence: మంచి మనసు చాటుకున్న రాఘవ లారెన్స్‌

ప్రెస్‌మీట్‌కు హాజరైన వ్యక్తి పేరు విక్రమ్ మిస్రీ. విక్రమ్ మిస్రీ విదేశాంగ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన విక్రమ్ మిస్రీ ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (IFS)లో అధికారి. విక్రమ్ మిస్రీ దేశ 35వ విదేశాంగ కార్యదర్శి. ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో విక్రమ్ మిస్రీ భారతదేశం తీసుకున్న చర్యలపై సమాచారం ఇచ్చారు. అంతే కాకుండా పాకిస్థాన్‌కి చెందిన పలు దుశ్చర్యలను వివరించారు. ఈ వివరణ ప్రపంచం ముందు పాకిస్థాన్ చీకటి రహస్యాలను బయటపెట్టింది. పాకిస్థాన్‌ ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాదులకు సంబంధించిన అనేక ఆధారాలను వెల్లడించారు. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? అతన్ని అమరవీరుడు అని ఎవరు పిలిచారో నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అంటూ పాకిస్థాన్ ఉగ్రవాద ప్రేరేపిత పనులను ప్రపంచానికి తెలిపారు.

READ MORE: HONOR 400 Series: 200MP ప్రధాన కెమెరా, 100W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లతో లాంచ్ కానున్న హానర్ 400 సిరీస్.!

విక్రమ్ మిస్రీ 1964 నవంబర్ 7న జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జన్మించారు. అతను కాశ్మీరీ పండిట్ కుటుంబం నుండి వచ్చాడు. విక్రమ్ మిస్రీ తన ప్రారంభ విద్యను శ్రీనగర్‌లోని బర్న్ హాల్ స్కూల్, డీఏవీ స్కూల్‌లో పూర్తి చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని సింధియా స్కూల్‌లో కూడా చదువుకున్నారు. విక్రమ్ మిస్రీ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హిందూ కళాశాల నుంచి చరిత్రలో పట్టభద్రుడయ్యారు. దీని తరువాత.. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లోని జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.1989లో ఐఎఫ్ఎస్ అధికారి అయ్యారు. అనేక విభిన్న పదవులను నిర్వహించారు. దేశంలోని ముగ్గురు ప్రధానులతో కలిసి పనిచేశారు. 1997లో ప్రధానమంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రైవేట్ కార్యదర్శిగా పని చేసినప్పుడు విక్రమ్ మిస్రీ వెలుగులోకి వచ్చారు. 2012లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రైవేట్ కార్యదర్శి అయ్యారు. 2014లో స్పెయిన్‌లో భారత రాయబారిగా పనిచేశారు. 2016లో మయన్మార్‌కు భారత రాయబారిగా నియమితులయ్యారు. 2019లో చైనాకు భారత రాయబారిగా నియమితులయ్యారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రైవేట్ కార్యదర్శిగా కూడా పని చేశారు. 28 జూన్ 2024న, ఆయన భారత విదేశాంగ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించరు. ఇప్పుడు ఆమె ఆపరేషన్ సిందూర్ గురించి సమాచారం ఇచ్చి మళ్ళీ వార్తల్లో నిలిచారు.

Exit mobile version