TG TET 2024 Results: టీజీ టెట్ ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
- టీజీ టెట్-2024 ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13%
- పేపర్-2లో అర్హత సాధించిన వారు 34.18%
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG TET 2024 Results: టీజీ టెట్-2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. టీజీ టెట్-2024కు 2,86,381 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. అర్హత సాధించిన 57,725 అభ్యర్థులు కాగా.. పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% కాగా.. పేపర్-2లో 34.18% అర్హత సాధించిన వారు
https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉంచారు. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% అర్హత శాతం పెరిగింది. 2023తో పోలిస్తే పేపర్-2లో 18.88% అర్హత శాతం పెరిగిందని సీఎం రేవంత్ అన్నారు. టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదన్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించింది. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది
Read also: Ponnam Prabhakar: గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది..
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ఇప్పటికే తెలంగాణలో టీచర్ల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకోసం జూలై నెలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ టెట్ పరీక్షలను తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో టెట్ పరీక్షకు మంచి డిమాండ్ ఉంది. డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) రాయాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. అందుకే B.D., D.Ed పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ పరీక్షలో ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రతిసారీ పెద్ద సంఖ్యలో పోటీపడతారు. మరోవైపు ఎన్నికలకు ముందు టెట్ పరీక్షను నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఫలితాలను ప్రకటించలేదు.
Read also: Ponnam Prabhakar: గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది..
టెట్ ఫలితాలను ఇలా తనిఖీ చేయండి
* తెలంగాణ టెట్ 2024 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ముందుగా https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
* హోమ్‌పేజీలో కనిపించే TS TET 2024 ఫలితాల ఎంపికపై క్లిక్ చేయండి.
* మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి, ఫలితాలను పొందండిపై క్లిక్ చేయండి.
* మీ స్కోర్ కార్డ్ ఇక్కడ ప్రదర్శించబడుతుంది.
* ప్రింట్ డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా కాపీని పొందవచ్చు.
* టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో టెట్ స్కోర్ ముఖ్యం.
* భవిష్యత్ సూచన కోసం టెట్ స్కోర్ కార్డ్ కాపీని జాగ్రత్తగా ఉంచుకోవాలి.
Rajasthan : ఇన్ స్టాలో లవ్.. ఐదుగురు పిల్లలను వదిలి ప్రియుడి వద్దకు చేరిన వివాహిత
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!