ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న పాన్ ఇండియా హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. అల్లు అర్జున్ ఇప్పటికి ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించాడు. అందులో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆర్య సినిమా ఒకటి.. ఆ సినిమా వచ్చి ఇప్పటికి ఇరవై ఏళ్లు అయ్యింది.. అప్పట్లో ఈ మూవీ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించింది.. అద్భుతమైన పాటలతో ఆర్య మూవీ యూత్ ని బాగా ఆకట్టుకుంది.
డైరెక్టర్ సుకుమార్ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ సినిమా అప్పటిలో సూపర్ హిట్ అవ్వడంతో ఇటు డైరెక్టర్ కు అటు అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ ను అందించింది.. ఆర్య సినిమాను గుర్తు చేసుకుంటూ అల్లు అర్జున్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తన జీవితాన్ని మార్చేసిన ఈ సినిమాకు మొదట హీరోగా వేరొక హీరోను అనుకున్నాడట..
అతన్ని ఊహించుకుంటూ ఈ సినిమాను రాసినట్లు తెలుస్తుంది.. ఆ హీరో మరెవ్వరో కాదు అల్లరి నరేష్.. అతనికోసమే ఈ సినిమాను రాసినట్లు ఓ ఇంటర్వ్యూ లో నరేశ్ చెప్పాడు.. అయితే ఆ సినిమాకు సుకుమార్ ఓ సందర్భంలో తనతో చెప్పినట్లు అల్లరి నరేష్ స్వయంగా వెల్లడించాడు. కానీ అది కుదరలేదు. ఆ తర్వాత బన్నీకి ఛాన్స్ వచ్చిందని ఆయన అన్నారు..అప్పటికే ఎన్నో కథలు విన్న అల్లు అర్జున్ కు ఈ కథ బాగా నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పాడు.. అలా ఆ సినిమా ఛాన్స్ బన్నీకి వచ్చిందని తెలుస్తుంది. ఇప్పుడు పుష్ప 2 లో అల్లు అర్జున్ నటిస్తున్నాడు.. త్వరలోనే ఆ సినిమా విడుదల కాబోతుంది..