మంగళవారం తొలి ఐపీఎల్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ముగిసింది. హైదరాబాద్ ను ఓడించి కోల్‌కతా నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. రెండో క్వాలిఫయింగ్ గేమ్ లో మరోసారి సన్‌రైజర్స్ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కోల్‌కతా ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. చివరిగా 2014లో విజేతగా నిలవగా.. ఇప్పుడు పదేళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్ గా నిలిచే అవకాశం వచ్చింది. ఫైనల్ లో తమ జట్టు కచ్చితంగా గెలుస్తుందని కేకేఆర్ అభిమానులు గట్టిగా చెబుతున్నారు. ఇందుకోసం తమ వద్ద కొన్ని లెక్కలు ఉన్నాయని చెబుతున్నారు. 2018 సీజన్ తొలి క్వాలిఫయింగ్ గేమ్ లో గెలిచిన జట్టుకే టైటిల్ దక్కిందన్నది వారి వాదన. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన గణాంకాలపై ఓ లుక్కేద్దాం.
Hemant soren: సుప్రీంలో హేమంత్ బెయిల్ పిటిషన్లు ఉపసంహరణ.. కారణమిదే!
సన్‌రైజర్స్ హైదరాబాద్ 2018 సీజన్‌లో అద్భుతంగా సాగింది. హమేహమీ జట్లని ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ కు చేరుకుంది. సీఎస్‌కే రెండో స్థానంలో ఉండగా.. రెండు జట్లకు జరిగిన తొలి క్వాలిఫయింగ్ రౌండ్‌లో చెన్నై విజయం సాధించగా., సన్‌రైజర్స్ రెండో రౌండ్ లో విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించింది. అయితే చివరకు మరోసారి చెన్నై చేతిలో పడింది. ఇక 2019లో మరోసారి తొలి రౌండ్‌లోని జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. అక్కడ ముంబై చెన్నై జట్ల మధ్య చివరి మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా జరిగింది. చివరకి చెన్నై పై ముంబై కేవలం ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.
Kalki 2898 AD : బుజ్జి పరిచయ వేదికకు సర్వం సిద్ధం..స్పెషల్ గా నిలువనున్న ఆ బైక్ స్టంట్ షో..?
2020 సీజన్ లో మొదటి క్వాలిఫైయింగ్ మ్యాచ్ ముంబై, ఢిల్లీ మధ్య జరిగింది. ఇందులో భారీ విజయంతో ముంబై ఫైనల్ కు చేరింది. రెండో క్వాలిఫయర్ లో సన్‌రైజర్స్‌ను ఓడించిన ఢిల్లీ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే మరోసారి ముంబై విజేతగా నిలిచింది. అలాగే 2021 లో ఢిల్లీతో జరిగిన తొలి క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో చెన్నై గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. పాయింట్ల పట్టికలో డీసీ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. సీఎస్‌కే ఫైనల్‌కు చేరుకుంది. కోల్‌కతా ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2లో గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంది. చెన్నై అక్కడ కేకేఆర్‌ను ఓడించి మరోసారి చాంపియన్‌గా నిలిచింది. ఇక 2022లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్ మొదటి సీజన్ లోనే టైటిల్ గెలుచుకుంది. తొలి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో గుజరాత్, రాజస్థాన్ తో తలపడింది. ఫైనల్ లో కూడా వీరి మధ్య పోరు జరగగా గుజరాత్ గెలిచి టైటిల్ గెలుచుకుంది. 2023లో..: చెన్నై సూపర్ కింగ్స్ 2023 సీజన్ విజేతగా నిలిచింది. పాయింట్ల పట్టికలో గుజరాత్, చెన్నై తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. తొలి క్వాలిఫయర్‌లో జీటీపై సీఎస్కే గెలిచింది. మళ్లీ ఫైనల్ వీరి మధ్య పడినపప్పటికీ.. చెన్నై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ఇక చివర జరిగిన 2023 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. పాయింట్ల పట్టికలో గుజరాత్, చెన్నై తొలి రెండు స్థానాల్లో ఉండగా.. మొదటి క్వాలిఫైయింగ్ రౌండ్ లో చెన్నై గుజరాత్ ని ఓడించింది. చివరగా ఫైనల్ మ్యాచ్ లో మల్లి వీళ్లిద్దరే తలపడగా చెన్నై గెలిచి చాంపియన్ గా నిలిచింది.