NTV Telugu Site icon

WhatsApp Stop In Mobiles : ఇకపై ఆ 35 స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్ లో మీ ఫోన్ ఉందోలేదో చూసుకోండి..

Whatsapp

Whatsapp

WhatsApp Stop In Mobiles : ముఖ్యమైన అప్డేట్‌ లో భాగంగా వాట్సాప్ దాని కనీస సిస్టమ్ అవసరాలను మార్చింది. దింతో పాత ఫోన్‌లు వాడుతున్న వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. నివేదిక ప్రకారం.., శామ్సంగ్, మోటరోలా, హువాయి, సోనీ, ఎల్జి, ఆపిల్ వంటి బ్రాండ్‌ల నుండి 35 మొబైల్ ఫోన్‌లు ఇకపై వాట్సాప్ అప్డేట్‌ లేదా భద్రతా ప్యాచ్‌ లను పొందలేవు. ఈ చర్య యాప్ పనితీరు, భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కొంతమంది వినియోగదారులు వాట్సాప్ ఉపయోగించడం కొనసాగించడానికి వారి పరికరాలను అప్‌గ్రేడ్ చేయవలసి ఉంటుంది.

Aparna Cinema: ఓపెనైన నెల్లో కల్కిపై కోటి గ్రాస్ సంపాదించిన మల్టీప్లెక్స్

వాట్సాప్ మద్దతును కోల్పోయే అవకాశం ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ప్రభావిత పరికరాలలో వివిధ రకాల ప్రసిద్ధ కంపెనీ ఫోన్ లు ఉన్నాయి. గాలక్సీ నోట్ 3, గాలక్సీ S3 మినీ, గాలక్సీ S4 మినీ వంటి ఫోన్‌లను కలిగి ఉన్న శామ్సంగ్ వినియోగదారులు ప్రత్యామ్నాయాల కోసం చూసుకోవాలి. మోటోరోలాలో Moto G , Moto X కూడా జాబితాలో ఉన్నాయి. ఆపిల్ లో iPhone 6, iPhone SE వంటి ఇటీవలి మోడల్‌లు కూడా యాప్‌కు మద్దతు ఇవ్వవు. హువాయి, లెనోవో, సోనీ, ఎల్జిలు కూడా అనేక మోడళ్లను ప్రభావితం చేశాయి. ఇక ఏ మోడల్స్ లో వాట్సాప్ పనిచేయదో లిస్ట్ చూస్తే ఇలా ఉంది.

IND vs PAK: లాహోర్ వేదికగా ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్.. ఛాంపియన్స్ ట్రోఫీ డ్రాఫ్ట్ సిద్ధం చేసిన పీసీబీ..

* Samsung: Galaxy Ace Plus, Galaxy Core, Galaxy Express 2, Galaxy Grand, Galaxy Note 3, Galaxy S3 Mini, Galaxy S4 Active, Galaxy S4 Mini, Galaxy S4 Zoom
* Motorola: Moto G, Moto X
* Apple: 5Ap , iPhone 6, iPhone 6S, iPhone 6S Plus, iPhone SE
* Huawei: Ascend P6 S, Ascend G525, Huawei C199, Huawei GX1s, Huawei Y625
* Lenovo: Lenovo 46600, Lenovo A8580, Lenovo A85870 : Xperia Z1, Xperia E3
* LG: Optimus 4X HD, Optimus G, Optimus G Pro, Optimus L7

Show comments