* నేడు మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ..
* నేడు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భేటీ.. కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సమావేశం.. బడ్జెట్ ప్రిపరేషన్ రాష్ట్రాల విజ్ఞప్తులను స్వీకరించనున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్..
* నేడు ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశానికి హాజరుకానున్న భట్టి విక్రమార్క..
* నేడు ఖమ్మం జిల్లాలో మంత్రులు పొంగులేటి, తుమ్మల పర్యటన..
* నేడు హైదరాబాద్ లో బీజేపీ సెల్ కీలక సమావేశం.. జీహెచ్ఎంసీ విలీన వివాదంలో న్యాయపోరాటంపై చర్చ..
* నేడు టీడీపీ పార్టీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు..
* నేటి నుంచి తిరుపతిలో ఫ్లెమింగో ఫెస్టివల్.. మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు.. 12న ఫ్లెమింగో ఫెస్టివల్ కు హాజరుకానున్న చంద్రబాబు..
* నేడు రెండో రోజు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. గొల్లప్రోలులో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న పవన్.. జిల్లా పోలీస్ కార్యాలయంలో శాంతి భద్రతలపై సమీక్ష సమావేశం.. రంగరాయ మెడికల్ కాలేజ్ లో 10 కోట్లతో నిర్మించనున్న నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం..
* నేడు మూడో రోజు ఆవకాయ అమరావతి ఉత్సవాలు.. పున్నమిఘాట్ వేదికగా ఉత్సవాల చివరి రోజు కార్యక్రమాలు.. ఉదయం 11 గంటలకు కథా కాలక్షేపంతో కార్యక్రమాలు ప్రారంభం..
* నేడు విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు..
* నేడు నుంచి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు.. ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు వ్యతిరేకంగా నిరసనలు..
* నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రధాని మోడీ పర్యటన.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ లో పాల్గొననున్న మోడీ..
* నేటి డబ్ల్యూపీఎల్ లో రెండు మ్యాచులు.. మధ్యాహ్నం 3: 30 గంటలకు నవీ ముంబై వేదికగా గుజురాత్ వర్సెస్ యూపీ మ్యాచ్.. రాత్రి 7: 30 గంటలకి నవీ ముంబై వేదికగా ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్..
* నేడు విడుదల కానున్న పరాశక్తి సినిమా.. శివకార్తికేయన్ పరాశక్తి సినిమాకు లైన్ క్లియర్.. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించిన నిర్మాతలు..