* ఐపీఎల్ 2024లో నేడు పంజాబ్‌తో బెంగళూరు ఢీ.. రాత్రి 7.30 గంటలకు ధర్మశాల వేదికగా మ్యాచ్
* ఢిల్లీ: ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు రాష్ట్రపతి భవన్ లో చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకోనున్న చిరంజీవి
* కర్నూలు: నేడు సీఎం జగన్ కర్నూలు పర్యటన.. 10.35కి కర్నూలు చేరుకోనున్న జగన్.. స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ సర్కిల్ లో జగన్ సభ
* అనంతపురం : నేడు కళ్యాణదుర్గంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం జగన్. మధ్యాహ్నం 1:30 గంటలకు సభ.
* అన్నమయ్య జిల్లా : నేడు జిల్లాకు ముఖ్యమంత్రి రాక.. రాజంపేట లో ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగ సభ… పాత బస్టాండ్ కూడలి లో మధ్యాహ్నం మూడు గంటలకు సభ… ఏర్పాట్లకు చేస్తున్న వైసిపి నేతలు..
* నేడు మెదక్ జిల్లా నర్సాపూర్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన.. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా రాహుల్ ఎన్నికల ప్రచారం.. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ లో బహిరంగ సభలో పాల్గొననున్న రాహుల్ గాంధీ
* నేడు రాహుల్ గాంధీతో కలిసి నర్సాపూర్, సరూర్ నగర్ ఎన్నికల ప్రచార సభలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ జన జాతర సభలో పాల్గొననున్న సీఎం.. సాయంత్రం 6 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో జన జాతర సభలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి..
* విశాఖ: నేడు ఉత్తరాంధ్రలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం.. సాయంత్రం సీతం పేటలో రోడ్ షో.. రాత్రికి NTR భవన్ లోనే చంద్రబాబు నైట్ హాల్ట్
* నేడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన.. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని లాలాపేట్ జ్యోతిరావు పూలే స్టాచు నుంచి ప్రారంభమై శాంతినగర్, టీచర్స్ కాలనీ, విజయపురి కాలనీ, తార్నాక మీదుగా బౌద్ధ నగర్, వారాసిగూడ, సీతాఫల్మండి, మైలార్ గడ్డలో ముగియనుంది.. సాయంత్రం 6 గంటలకు అంబర్పేట్ నియోజకవర్గంలోని లింగంపల్లి రాఘవేంద్ర స్వామి టెంపుల్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్, ఫీవర్ హాస్పిటల్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్, రెడ్ బిల్డింగ్ ఎక్స్ రోడ్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్, బాపునగర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్, పటేల్ నగర్ ఎక్స్ రోడ్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్, మహాత్మ జ్యోతి పులె స్టాచ్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్, డీ మార్ట్, గోల్నాక ఎక్స్ రోడ్, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, కృష్ణానగర్ అంబేద్కర్ స్టాచు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ , నింబోలి అడ్డ మహంకాళి టెంపుల్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్న కిషన్‌రెడ్డి
* తెలంగాణలో నేటి రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన రద్దు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అనారోగ్యానికి గురి కావడంతో నేటి బహిరంగ సభ రద్దు చేసినట్టు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ, జహీరాబాద్ పార్లమెంట్ ప్రబారి పెద్దల గంగారెడ్డి ప్రకటన.
* ఖమ్మం: నేడు మధిర నియోజకవర్గంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క
* ప్రకాశం : ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం: మండ్లమూరులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న దర్శి వైసిపి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ..టి.పి.గూడూరు మండలంలో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు
* నెల్లూరు: చేజర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఆత్మకూరు వైసిపి అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి
* నెల్లూరు: వెంకటాచలం మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న సర్వేపల్లి టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి
* తిరుమల: 4 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,766 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,158 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.09 కోట్లు
* తూర్పుగోదావరి జిల్లా: రేపటి నుండి గోదావరి డెల్టా సిస్టం పరిధిలో పంట కాలువలు మూసివేత.. రబీ పంటకు నీటి సరఫరా విడుదల నిలుపువేత.. చివరి స్థాయికి చేరిన మూడు ప్రధాన కాలువలైన తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టా ప్రధాన కాలువల పరిధిలో వరిపంట , త్రాగునీటి అవసరాలు.. పంట కాలువల నీటి విడుదల రేపు సాయంత్రం 6.00 గంటలకు నిలుపుదల.. తిరిగి కాలువలకు జూన్ 10వ తేదీ నుండి నీటి విడుదల