* ఢిల్లీ: నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.. హాజరుకానున్న పలు రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు
* నేడు కర్ణాటక కేబినెట్ విస్తరణ.. ఈ రోజు రాజ్‌భవన్‌లో మరో 24 మంది మంత్రుల ప్రమాణస్వీకారం
* ఢిల్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటన.. నేడు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్.. రేపు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న ఏపీ సీఎం..
* తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో స్నాక్స్.. పైలట్ ప్రాజెక్టుగా నేటి నుంచి ఈ-గరుడ బస్సుల్లో అమలు
* చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డికి అస్వస్థత.. నేడు భాస్కర్‌రెడ్డిని నిమ్స్‌కు తరలించనున్న జైలు అధికారులు.
* నేడు హైదరాబాద్‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీకానున్న కేజ్రీవాల్..
* నేడు ఏపీలోని 97 మండలాల్లో వడగాల్పులు.. అల్లూరి, అనకాపల్లి, బాపట్ల, తూర్పు గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, మన్యం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వగ గాల్పులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
* నేడు ఖమ్మంలో బీజేపీ నిరుద్యోగ మార్చ్.. పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..
* భద్రాద్రి: నేడు కొత్తగూడెంలో పోడు రైతుల కు పట్టాలు ఇవ్వాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ర్యాలీ.. పోడు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ కు విజ్ఞాపన ఇవ్వనున్న పొంగులేటి
* ప్రకాశం : పుల్లలచెరువులో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. అనంతరం స్థానిక సచివాలయం -2 పరిధిలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.
* ప్రకాశం : ఒంగోలు లోని 24వ డివిజన్ చేపల మార్కెట్ లో అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేయనున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ లో జగనన్న విద్యాదీవెన పథకంపై జిల్లా ప్రైవేట్ కళాశాలల ప్రతినిధులతో సాంఘీక సంక్షేమ శాఖ అధికారుల సమీక్ష..
* బాపట్ల : చీరాలలో సినీ నటుడు దగ్గుబాటి రానా సోదరుడు అభిరామ్ తేజ దర్శకత్వంలో నటించిన అహింస చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం, హాజరుకానున్న పలువురు సినీ ప్రముఖులు..
* నేడు ఏలూరులో అమరావతి జేఏసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సు.. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్.. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ.
* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుంచి రెండు రోజులు రాజమండ్రిలో టీడీపీ మహానాడు.. నేడు తొలిరోజు టీడీపీ మహానాడుకు 15 వేల మంది పార్టీ నేతలు హాజరు. మహానాడులో 15 తీర్మానాలు
* నేడు మహానాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుని (2023 – 25) ఎన్నిక.. నేడు ఉదయం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యి సాయంత్రానికి ముగింపు.. సాయంత్రం 4.00 గంటలకు ఓటింగ్ నిర్వహించి 7 గంటలకు ఫలితాలు ప్రకటన..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో రైతు భరోసా కేంద్రాలు. సచివాలయ భవనాలను ప్రారంభిస్తారు.. అనంతరం సర్వేపల్లి గ్రామంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* GSLV F-12 రాకెట్ ప్రయోగం పై నేడు శ్రీహరికోటలో మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం
* నేడు శ్రీహరికోటకు ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్.. రాకెట్ ప్రయోగంపై శాస్రవేత్త లతో సమావేశం
* శ్రీకాకుళం: మధ్యాహ్నం 3 గంటల నుండి పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 20వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.. పాల్గొననున్న మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు.
* అనంతపురం : ఎస్కేయూ పరిధిలో జూన్ 5 నుంచి నిర్వహించనున్న డిగ్రీ పరీక్షలు వాయిదా. పీజీ కోర్సు ప్రవేశ పరీక్షల దృష్ట్యా వాయిదా వేసినట్లు అధికారుల వెల్లడి.
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 79,486 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 40,250 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు