* బెంగళూరు: ఈ రోజు రాత్రి 7 గంటలకు కర్ణాటక సీఎల్పీ భేటీ.. సమావేశానికి ప్రతి ఒక్కరు తప్పని సరిగా హాజరు కావాలంటూ KPCC అధ్యక్షుడి హోదాలో DK శివకుమార్ లేఖ.. కాంగ్రెస్ ఎంపీలు కూడా హాజరవ్వాలని పిలుపు
* ఈ రోజు ఢిల్లీ నుంచి బెంగళూరుకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్..
* హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ.. కొత్త సచివాలయంలో మొదటి కేబినెట్ సమావేశం .. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ దశాబ్ది వేడుకలు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పేర్ల ఖరారుతో పాటు పలు పాలన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం
* హైదరాబాద్: నాగోల్‌లో తెలంగాణ బీజేపీ ఓబీసీ రాష్ట్ర సదస్సు .. పాల్గొననున్న బండి సంజయ్, రాజ్య సభ ఎంపీ లక్ష్మణ్, రాష్ట్ర ఇంఛార్జి తరుణ్ చుగ్
* ఢిల్లీ: ఉదయం 9 గంటలకు కేసీ వేణుగోపాల్ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్.. ఢిల్లీలో తొలిసారి కేసీ వేణుగోపాల్ ఇంట్లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ను ముఖాముఖి కూచో పెడుతున్న కాంగ్రెస్ హై కమాండ్.. నాలుగు రోజులుగా ఇద్దరు ఢిల్లీలో వున్నా ఒక్క సారి కూడా కలవని సిద్ధు అండ్ డీకేఎస్..
* చెన్నై: జల్లికట్టుపై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు …
* అమరావతి: గృహ నిర్మాణ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం.. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ, టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీల్లో పనుల పురోగతిపై సమీక్ష చేయనున్న సీఎం జగన్
* బాపట్ల : చీరాలలో చేనేత రంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రస్థాయి చేనేత సమావేశం, హాజరుకానున్న రాష్ట్రస్థాయి చేనేత నాయకులు..
* ప్రకాశం : ఒంగోలులో జిల్లా పవర్ లిఫ్టింగ్ జూనియర్, సబ్ జూనియర్ బాలబాలికల జట్లకు క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం..
* నెల్లూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తోటపల్లి గూడూరు మండలం జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షితాయి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం
* నెల్లూరు జిల్లా: ఈ నెల 29న శ్రీహరికోట నుంచి GSLV మార్క్-3 రాకెట్ ప్రయోగం.. దేశీయ నావిగేషన్ అవసరాల కోసం IRNSS ఉపగ్రహాన్ని కక్ష్య లోకి ప్రవేశపెట్టనున్న శాస్త్రవేత్తలు.. శ్రీహరి కోటలో మొదలైన రాకెట్ అనుసంధాన కార్యక్రమాలు
* కడప : విద్యుత్ వినియోగ దారుల సమస్యల పరిష్కారం కోసం నేడు డయల్ యువర్ విద్యుత్ ఎస్సీ కార్యక్రమం..
* తూర్పుగోదావరి జిల్లా : ఈనెల 24న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పర్యటన.. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.
* అనంతపురం: కళ్యాణదుర్గం పట్టణంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు సమావేశంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్.
* కాకినాడ: జీజీహెచ్‌లో నేటి నుంచి మధ్యాహ్నం అదనంగా 3 నుంచి 4 వరకు ఓపీ సేవలు.. ఉదయం టెస్ట్‌లు చేయించుకున్న తర్వాత పేషెంట్లు మళ్లీ రావాల్సి వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్న డీఎంఈ.
* విజయనగరం: నేడు ఎస్ కోట రానున్న టీడీపీ అధినేత చంద్రబాబు..
* తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండి.. వెలుపల బాట గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 79,207 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 41,427 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.3.19 కోట్లు