* హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్న మరో ఫ్లై ఓవర్.. నేడు బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ప్రారంభం.. సాయంత్రం 4 గంటలకు ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈ ఫ్లై ఓవర్‌తో ఎల్బీ నగర్-సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు
* ఢిల్లీ: నేడు కేంద్ర మంత్రి అమిత్‌షాతో మరోసారి భేటీకానున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.
* నేడు మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రజా దీవెన సభ.. గుండ్ల పోచంపల్లిలో సభకు ఏర్పాట్లు.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు..
* హైదరాబాద్: ఉదయం 11.30కు సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం.
* నేడు హైదరాబాద్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన.. హిమాయత్ నగర్ డివిజన్ సంజయ్ గాంధీ కాలనీ, వెంగల్ రావు నగర్ డివిజన్, చంద్ పాషా దర్గా దగ్గర, లక్ష్మి నగర్, హనుమాన్ టెంపుల్ దగ్దర, ఎర్రగడ్డ డివిజన్ శంకరలాల్ నగర్ లో, రహమాత్ నగర్ డివిజన్, ఫాతిమా నగర్ లో, బోరబండ డివిజన్ బ్రాహ్మణ వాడి సైట్ 3 లో పవర్ బోర్లు ప్రారంభించనున్న కిషన్‌రెడ్డి. సాయంత్రం ట్యాంక్ బాండ్ సంజీవయ్య పార్కులో లేజర్ షో ను ప్రారంభిస్తారు.
* బాపట్ల : మేదరమెట్ల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సిద్దం సభ స్థలాన్ని పరిశీలించనున్న వైసీపీ ముఖ్య నేతలు..
* ప్రకాశం : ఒంగోలు లోని పలు డివిజన్లలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* బాపట్ల : కొరిశపాడు మండలం పి గుడిపాడు వద్ద సిద్ధం సభకు సీఎం జగన్ వస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు సభకు విచ్చేసే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల దారి మళ్లింపు..
* విశాఖకు మరో వందే భారత్ రైలు.. ఈ నెల 12న ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. భువనేశ్వర్ – విశాఖల మధ్య రాకపోకలు సాగించనున్న వందే భారత్.. పూర్తయిన ట్రైల్ రన్.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మనుబోలు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమంలో పాల్గొంటారు
* నెల్లూరులో జరిగే బీజేపీ నేతలు, కార్యకర్తలు.. శక్తి కేంద్రాల ప్రముఖులతో సమావేశం కానున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ.. రాజమండ్రిలోని వై జంక్షన్ లోని కలెక్టర్ బంగ్లా నుండి పుష్కర ఘాట్ వరకు ర్యాలీ
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన కొవ్వూరు అసెంబ్లీ టికెట్ మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఆందోళన
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పర్యటన వివరాలు.. ఉదయం 8 గంటలకు గుడ్ మార్నింగ్ రాజమండ్రి రూరల్. ఆల్కాట్ తోట నుండి. ప్రారంభం. స్థానిక సమస్యలు, పారిశుద్ధ్య సమస్యలపై మంత్రి ఫోకస్.. ఉదయం 10 గంటల నుండి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి వేణు
* శ్రీ సత్యసాయి : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లేపాక్షిరో స్వామివారి బ్రహ్మ రథోత్సవం.
* అనంతపురం : కళ్యాణదుర్గం , రాయదుర్గంలలో పర్యటించనున్న ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
* ఏలూరు: మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన వివరాలు.. ఉదయం 6 గంటల నుండి తాడేపల్లిగూడెం బలుసులమ్మ గుడి వద్ద ధర్మ ప్రచార మహోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే శ్రీవారి నిత్య సేవలలో పాల్గొంటారు . సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు
* నేడు కాకినాడ లో పర్యటించనున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు ను ప్రారంభించనున్న వెంకయ్యనాయుడు
* చిత్తూరు: ఎస్ఆర్ పురం మండలంలో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సమన్వయకర్త కృపాలక్ష్మి
* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నాలుగో విడత చేయూత లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయునున్న డిప్యూటి సీఎం రాజన్న దొర