* మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు.. కిక్కిరిసిన భక్తులు.. ప్రత్యేక పూజలు..
* ఢిల్లీ: బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులపై నేడు నిర్ణయం.. మధ్యాహ్నంలోపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం.. నిన్న రాత్రి జరిగిన చర్చల వివరాలను ఏపీ బీజేపీ నేతలతో
పార్టీ అగ్రనాయకత్వం నేడు చర్చించే అవకాశం. ఈరోజు మధ్యాహ్నం వరకు ఢిల్లీలోనే ఉండనున్న చంద్రబాబు.
* నేడు వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. వెయ్యి స్తంభాల గుడిలోని పునర్నిర్మాణం చేసిన కళ్యాణమండపాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ములుగు జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న గిరిజన యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి..
* ప్రకాశం : ఒంగోలు లోని పలు డివిజన్లలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ఒంగోలులో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..
* బాపట్ల : మేదరమెట్ల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సిద్దం సభ స్థలాన్ని పరిశీలించనున్న వైసీపీ ముఖ్య నేతలు..
* ప్రకాశం : ముండ్లమూరు మండలం ఈదరలో వైఎస్సార్ విగ్రహ ఆవష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ , దర్శి వైసీపీ ఇంచార్జీ బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి..
* ప్రకాశం : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శైవాలయాల వద్ద భక్తుల రద్దీ.. త్రిపురాంతకం, భైరవకోన, బెస్తవారిపేట మండలం మోక్షగుండం, టంగుటూరు మండలం జమ్మలపాలెం, చిన్నగంజాం మండలం సోపిరాల, మిట్టపాలెం నారాయణస్వామి ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. శివనామ స్మరణలతో మార్మోగుతున్న శైవాలయాలు..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు: విడవలూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నిక్షల ప్రచారం నిర్వహించనున్న ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
* నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ నేతల సమావేశం
* తూర్పుగోదావరి జిల్లా: భక్తిపార్వసంతో సాగుతున్న మహాశివరాత్రి వేడుకలు.. రాజమండ్రిలో. భక్తులు కిటకిటలాడుతున్న గోదావరి స్థాన ఘట్టాలు.. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్న. భక్తులు.. కిక్కిరిసిన రాజమండ్రి పుష్కర్ ఘాట్, కోటిలింగాలు ఘాట్.. శివాలయాల్లో తెల్లవారుజాము నుండి ప్రారంభమైన దర్శనాలు
* రాజమండ్రిలో కోటిలింగాలు ఘాట్ నుండి పుష్కర్ ఘాట్ మీదుగా గౌతమి ఘాట్ వరకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు.. గోదావరి గట్టు రోడ్లో భక్తులు రద్దీ దృష్ట్యా వాహనాల రాకపోకలు నిలిపివేత.. స్నాన ఘట్టాల్లో. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పడవలతో గజ ఈతగాళ్లు ఏర్పాటు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పర్యటన వివరాలు.. మహాశివరాత్రి సందర్భంగా ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటున్న మంత్రి.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటన
* గుంటూరు : మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు… పల్నాడులోని కోటప్పకొండ, అమరావతి, గుంటూరు జిల్లాలోని క్వారీ, గోవాడ తదితర ప్రాంతాల్లోని శైవ క్షేత్రాల్లో కిక్కిరిసిన భక్తులు… శైవక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు…
* శ్రీ సత్యసాయి : లేపాక్షిలో మహాశివరాత్రి ని పురస్కరించుకుని శ్రీ దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శివపార్వతుల కళ్యాణోత్సవం, రుద్ర హోమం, దీపోత్సవం.
* తిరుపతి: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా శైవాలయాల వద్ద భక్తుల రద్దీ.. శివనామ స్మరణలతో మార్మోగుతున్న శైవాలయాలు..
* తిరుపతి: శ్రీకాళహస్తీ ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు .. ఉదయం నుండి స్వామివారి ప్రత్యేక అభిషేకాలు..పూజలు.. భక్తుల రద్దు దృష్టిలో పెట్టుకొని భారీ భద్రత ఏర్పాటు చేసినా తిరుపతి పోలీసులు
* తిరుమల: ఇవాళ టీటీడీ తరపున మహానంది ఆలయానికి పట్టువస్ర్తాలు సమర్పణ
* శ్రీ సత్యసాయి : పెనుకొండ పట్టణంలోని 4వ వార్డులో ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .
* అనంతపురం : తాడిపత్రి పట్టణంలోని దక్షిణకాశిగా పిలువబడే శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పోటెత్తిన భక్తులు.
* తిరుమల: 18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 57,880 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,772 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు
* వరంగల్ జిల్లా: శివరాత్రి వేడుకలకు ముస్తాబైన శివాలయాలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చారిత్రాత్మక వేయి స్తంభాల గుడి. రామప్ప దేవాలయం, మెట్టు రామలింగేశ్వర ఆలయం, కురవి వీరభద్ర స్వామి ఆలయం, అయినవోలు మల్లికార్జున స్వామి ఆలయం, పాలకుర్తి సోమేశ్వరాలయం శివరాత్రి వ్యక్తులకు సిద్ధమయ్యాయి.. ఈ ఆలయాల్లో అభిషేకం చేసుకునేందుకు తెల్లవారుజామున నుంచి భక్తులు బారులు తీరారు
* ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శివ నామ స్మరణతో మారు మ్రోగుతున్న శివాలయాలు. మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తుల అభిషేకాలు, పూజలు .. నల్గొండలోని పురాతన ఛాయా, పచ్చల సోమేశ్వర ఆలయాలకుపోటెత్తిన భక్తులు.. సూర్యాపేట పిల్లలమర్రి, మేళ్ల చెర్వు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల ఆధ్యాత్మిక సందడి. చెర్వు గట్టు పార్వతీజడల రామలింగేశ్వర స్వామి, వాడపల్లి ఆగస్తేశ్వర స్వామి దేవాలయాలల్లో భక్తుల పూజలు.
* ఖమ్మం: మహా శివరాత్రి కి పోటెత్తుతున్న శైవ క్షేత్రాలు.. గుంటి మల్లన్న , తీర్థాల, కూసుమంచి, పెనుబల్లి, మధిర , భద్రాచలం లలో శివాలయ లలో బారులు తీరిన భక్తులు
* ఖమ్మం: నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం మధిర నియోజకవర్గం లో పలు అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క