* ఐపీఎల్ 2024: నేడు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనున్న ముంబై ఇండియన్స్.. ఉప్పల్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
* ఢిల్లీ: ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీఈసీ సమావేశం.. తెలంగాణలోని మిగిలిన 8 లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేయనున్న కాంగ్రెస్
* నేడు హైదరాబాద్‌కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. రాజేంద్రనగర్ లో తెలంగాణ హైకోర్టు భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్న సీజేఐ.. పాల్గొననున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, మంత్రులు, అధికారులు..
* కడప : నేటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభం.. మధ్యాహ్నం గన్నవరం నుండి ఇడుపులపాయకు సీఎం.. వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు అనంతరం బస్సు యాత్రను ప్రారంభించనున్న సీఎం.. నేటి నుండి 21 రోజుల పాటు సాగనున్న బస్సు యాత్ర
* నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చ..
* అమరావతి: నేటి నుండి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభం .. ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్తోన్న టీడీపీ అధినేత. బహిరంగ సభలు,రోడ్ షోలు, కేడర్ మీటింగులు పెట్టుకోనున్న చంద్రబాబు.
* నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు, నగరి, మదనపల్లెలో చంద్రబాబు టూర్.
* తిరుమల: నేడు సినీ హీరో రాంచరణ్ పుట్టిన రోజు.. తన పుట్టినరోజు సందర్భంగా సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్న రాంచరణ్-ఉపాసన దంపతులు
* ప్రకాశం : ఒంగోలులో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..
* ఒంగోలు నగరంలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం: మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో నూతన ధ్వజ ప్రతిష్టాపన కొరకు పాత ద్వజం, అష్ట దిక్పాలకులు పీఠం బాలాలయం పూజ కార్యక్రమం..
*నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరులోని సుప్రసిద్ధ శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రథోత్సవం
* నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని విరాట్ నగర్.. ఆనం వెంకటరెడ్డి కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న నెల్లూరు లోక్‌సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి
* నెల్లూరు: దుత్తలూరు మండలంలోని వివిధ గ్రామాల్లో విజయ సంకల్ప యాత్ర నిర్వహించనున్న ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి
* తూర్పుగోదావరి జిల్లా: రేపు రాజమండ్రిలో బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ సమావేశం.. హాజరుకానున్న అరుణ్ సింగ్ , పురంధేశ్వరి, సోము వీర్రాజుతోసహా ముఖ్యనేతలు.. ఈ సమావేశానికి సోము వీర్రాజు హాజరవుతారో లేదోనని చర్చ
* తూర్పుగోదావరి జిల్లా: నేడు సినీ నటుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు.. రాజమండ్రి దానవాయిపేట సంజీవిని బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం నిర్వహణ
* పల్నాడు: నేడు నరసరావు పేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం…
* నేడు గుంటూరు మిర్చి యార్డ్ లో యథావిధిగా మిర్చి దిగుమతులు.. అధిక మిర్చి నిల్వలు కారణంగా, గడిచిన ఆరు వారాలుగా ప్రతి బుధవారం మిర్చి యార్డుకులో దిగుమతులు నిలిపివేస్తున్న పాలకవర్గం.. ఈ వారం నిలకడగా మిర్చి నిల్వలు ఉండటంతో యథావిధిగా దిగుమతులకు అనుమతిస్తున్న పాలకవర్గం….
* గుంటూరు: రేపు గుంటూరు బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నికలు..
* గుంటూరు: నేడు పెదనందిపాడులో ఇఫ్తార్ విందులో పాల్గొననున్న గుంటూరు టిడిపి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్.