* ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీతో పంజాబ్ ఢీ.. రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌తో తలపడనున్న కోల్‌కతా
* ఢిల్లీ: నేటితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ.. ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పర్చనున్న ఈడీ..
* తిరుమల: నాల్గో రోజు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. ఇవాళ తెప్పలపై ఐదు ప్రదక్షణములుగా విహరించనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. ఇవాళ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేసిన టీటీడీ
* అమరావతి: నేడు టీడీపీ అభ్యర్థులతో వర్క్ షాప్ నిర్వహించనున్న చంద్రబాబు. ఎన్నికల్లో వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వర్క్ షాప్ లో చర్చ.
* తెలంగాణలో నేటి నుంచి గ్రూప్-1 దరఖాస్తులో సవరణకు అవకాశం.. ఈ నెల 27 వరకు సవరణకు అవకాశం కల్పించిన అధికారులు
* ప్రకాశం : ఒంగోలులో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం: కొనకనమెట్ల మండలం వెలుగొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, అంకురార్పణతో ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు భారీగా తరలిరానున్న చుట్టుప్రక్కల ప్రాంతాల భక్తులు..
* ప్రకాశం: దొనకొండలో వైసీపీ నేతలతో ఇంచార్జీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సమీక్షా సమావేశం..
* ఒంగోలులో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..
* బాపట్ల : అద్దంకి మండలం శింగరకొండలో ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీప్రసన్నాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, మూడు రోజులపాటు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అనంతరం 25వ తేదీ స్వామి వారి తిరుణాళ్ల మహోత్సవం..
* చీరాల మండలం ఈపురుపాలెం శ్రీ రుక్మిణిసత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ద్వాదశ బ్రహ్మోత్సవాలలో భాగంగా పొన్నామను సేవ, కల్యాణ మహోత్సవాలు..
* తిరుమల: ఎల్లుండి తుంభూర తీర్ద ముక్కోటి.. రేపు ఉదయం 5 గంటల నుంచి ఎల్లుండి మధ్యహ్నం 12 గంటల వరకు భక్తులును తీర్దానికి అనుమతించనున్న టీటీడీ..
* కడప : నేడు ప్రొద్దుటూరు 26 వ వార్డులో ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం.
* కడప: వైసీపీ అసమ్మతి నేత, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివచంద్ర రెడ్డి కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వెంకటాచలం మండల నేతలతో సమావేశాన్ని నిర్వహిస్తారు
* నెల్లూరు రూరల్ మండలంలోని వడ్డిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి
* కడప : ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం.. రాజంపేట జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ అధ్వర్యంలో రాజంపేటలో సమావేశం…
* శ్రీ సత్యసాయి : కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహా స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామి వారి హనుమంత వాహన సేవ.
* అనంతపురం : నగరంలోని శారదా శంకర శృంగేరి మఠంలో నేటి నుంచి మూడు రోజుల పాటు సాగనున్న శారదా మాత పంచలోహ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం.
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: శనిత్రయోదశి సందర్భంగా కొత్తపేట(మ) మందపల్లి శనేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. శనిచేత ప్రతిష్టించిన ఏకైక ఆలయం శనేశ్వరస్వామి ఆలయం.. శనిదోష నివారణకు తైలాభిషేకాలు చేయించుకుంటున్న భక్తులు
* గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 12 మంది వాలంటీర్లు సస్పెన్షన్ .. రెండు రోజుల క్రితం ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి సమావేశంలో పాల్గొన్న వాలంటీర్లు .. ఈనెల 19న బలసాని కిరణ్‍కుమార్‍తో సమావేశమైన వాలంటీర్లు.. సమావేశంలో ఫోటోల అధారంగా 12 మందిని తొలగించిన అధికారులు.
* తిరుమలలో 15 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 58,236 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,446 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు
* కర్నూలు: నేడు కోడుమూరు మండలం గోరంట్ల శ్రీ లక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం, రాత్రి భేరి పూజ, సింహోత్సవం
* నంద్యాల: ఒంటి మిట్టలో జరిగే సీతారాముల కల్యాణానికి గోటితో వలచిన తలంబ్రాలు నేడు నంద్యాల నుండి తరలింపు
* నంద్యాల: అహోబిలం బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఎగువ అహోబిలం లో తొట్టి తిరుమంజనం, అశ్వ వాహనం.. నేడు దిగువ అహోబిలంలో గజ వాహనం, తిరు కళ్యాణోత్సవం..