* తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,860.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,370.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.79,900
* జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి.. రేపు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం.. రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
* ఢిల్లీ: నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరుకానున్న సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక.. పాల్గొననున్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ సీఎంలు.. ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు, దామోదర రాజనర్సింహ, డా.వంశీచంద్‌రెడ్డి.. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆమోదించనున్న సీడబ్ల్యూసీ సమావేశం
* ఢిల్లీ: సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ సీఈసీ సమావేశం.. ఖరారుకానున్న మిగిలిన 13 మంది తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులు
* తిరుమలలో రేపటి నుంచి శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. ఐదు రోజులు పాటు శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ.
* ప్రకాశం : మర్రిపూడి లోని ప్రముఖ పుణ్య క్షేత్రం పృదులగిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఈనెల 29 వరకు అంగరంగ వైభవంగా కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు..
* శ్రీ సత్యసాయి : గోరంట్లలో దళిత సంఘాల ఆత్మీయ సమావేశం.పాల్గొననున్న ఉషశ్రీ చరణ్.
* శ్రీ సత్యసాయి : కదిరిలో నేటి నుంచి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహా స్వామి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ.
* అనంతపురం : ఉరవకొండలో గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ బ్రహ్మరథోత్సవం.
* విశాఖ: వైసీపీ డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ గా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నియామకం.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకపోవడంతో అసంతృప్తిగా వున్న నాగిరెడ్డికి కీలక బాధ్యతలు అప్ప గించిన అధిష్ఠానం
* నెల్లూరు జిల్లా: ఏఎస్ పేట మండలంలోని వివిధ గ్రామాల్లో విజయీ భవ యాత్రను నిర్వహించనున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
* నెల్లూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నేతఎస్సైడ్లతో జిల్లా పార్టీ అధ్యక్షుడు మను క్రాంథ్ రెడ్డి సమావేశం
* నెల్లూరు రూరల్ నియోజకవర్గం నేతలతో వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమీక్ష సమావేశం
* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,051 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,107 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.78 కోట్లు
* కడప : మత సామరస్యాన్ని దేశ సమైక్యతను రక్షించాలని డిమాండ్ చేస్తూ నేడు వామపక్షాల సదస్సు..