* నేడు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. ఉదయం జగిత్యాల బీజేపీ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ
* జగిత్యాల జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయసాంకల్ప సభ కు ఏర్పాట్లు పూర్తి చేసిన బీజేపీ నాయకులు.. ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి జగిత్యాల కు బయలుదేరానున్న ప్రధానమంత్రి మోడీ.. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఉన్న హెలిపాడ్ వద్దకు చేరుకోనున్న మోడీ.. హెలిపాడ్ వద్ద 20 మంది నాయకులకు అనుమతి .. ఉదయం 10:45 ని ల కు జిల్లా కేంద్రం లో ని గీతవిద్యలాయం ఆవరణలో జరగనున్న విజయసాంకల్ప సభ ప్రాంగనానికి రోడ్ మార్గాన చేరకొనున్న ప్రధాని.. సభ వేదికపై కరీంనగర్ నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు.. సభ వేదిక పై 36 మంది నాయకులకు మాత్రమే అనుమతి
* నేటి నుంచి ఏపీ, తెలంగాణలో టెన్త్ పరీక్షలు.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు.. ఏపీలో హాజరుకానున్న 7.25 లక్షల మంది విద్యార్థులు.. తెలంగాణలో హాజరుకానున్న 5.08 లక్షల మంది విద్యార్థులు
* నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు..
* నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్.. ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ అఫిడవిట్ దాఖలు చేయనున్న కవిత భర్త అనిల్..
* ప్రకాశం జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలకు హాజరుకానున్న 30,928 మంది విద్యార్థులు.. పరీక్షలకు 170 కేంద్రాల ఏర్పాటు..
* బాపట్ల : ఇవాళ కొరిశపాడు, రేణింగవరం మధ్య జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ఫ్లైట్ లాండింగ్ ట్రైల్ రన్.. హైవే రన్ వే పై ఫ్లైట్స్ దిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన ఎయిర్ ఫోర్స్, హైవే అధికారులు.. అత్యవసర పరిస్థితుల కోసం దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై 13 రన్ వే లు.. కొరిశపాడు, రేణింగవరం మధ్య జాతీయ రహదారిపై 4.1 కిలోమీటర్ల పొడవునా 79 కోట్ల వ్యయంతో నిర్మించిన హైవే అథారిటీ.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య హైవే పై దిగనున్న విమానాలు..
* ప్రకాశం : ఎన్నికల కోడ్ కారణంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు..
* తిరుమల: రేపటి నుంచి ఆన్ లైన్ లో జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
* తిరుమల: 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. ఐదు రోజులు పాటు శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను రద్దు చేసిన టీటీడీ
* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుండి పదవ తరగతి పరీక్షలు.. జిల్లాలోనీ 137 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ రాయనున్న 29,990 మంది విద్యార్థులు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం రద్దు- కలెక్టర్ మాధవీలత
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గ నేతలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు
* నెల్లూరు: వెంకటగిరి లో వైసీపీ నేతలు.. కార్యకర్తల సమావేశం పాల్గొననున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వెంకటగిరి వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
* నెల్లూరు: చేజర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
* అనంతపురం : పెనుకొండలో కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .
* శ్రీ సత్యసాయి : రేపటి నుంచి కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహా స్వామి బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయకమిటీ.
* కడప : నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు.. జిల్లా వ్యాప్తంగా 153 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. పరీక్షకు 27858 విద్యార్థులలో 14,269 మంది అబ్బాయిలు, 13589 అమ్మాయిలు హాజరు కానున్నారు…
* అల్లూరి సీతారామ రాజు జిల్లా: రాష్ర్ట స్థాయి గిరిజన జాతర నిర్వహణపై ఎన్నికల ఎఫెక్ట్.. మే 19 నుంచి మూడు రోజులు పాడేరు మోదకొండమ్మ తల్లి ఉత్సవాలు… పోలింగ్ కారణంగా మే 13న జరగాల్సిన జాతరను 19కి మార్చిన నిర్వహణ కమిటీ.. ఏపీ, తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి తరలిరానున్న భక్తులు.
* నంద్యాల: అహోబిలం బ్రహ్మోత్సవాలు.. నేడు ఎగువ అహోబిలం లో ఉత్సవం, అభిషేకం, హనుమంత వాహనం … నేడు దిగువ అహోబిలంలో హంస వాహనం, అభిషేకం, సూర్యప్రభ వాహనం …
* నంద్యాల: మహానంది క్షేత్రంలో నేడు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు , సాయంత్రం పల్లకి సేవ
* నంద్యాల: నేడు శ్రీశైలంలో అరుద్రోత్సవం సందర్భంగా మల్లికార్జునస్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
* అన్నమయ్య జిల్లా : నేటి నుండి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 129 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు రాయనున్న 492 పాఠశాలలకు చెందిన 25,522 మంది విద్యార్థులు…
* రాజన్నసిరిసిల్ల జిల్లా: ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన ఆలయ అర్చకులు.. సోమవారం సందర్భంగా రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
* పెద్దపల్లి జిల్లా : నేడు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు. జిల్లాలో 45 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. 7,728 పరీక్షకు హాజరు కానున్న విద్యార్థులు..