* 106వ రోజుకు చేరిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర.. నేడు ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గంలో కొనసాగనున్న పాదయాత్ర.. పాలేరు నుంచి ఉదయం 9 గంటలకు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభం.. పాలేరు, కూసుమంచి, చేగొమ్మ కేశవాపురం జీళ్ళ చెరువు గోపాల్ రావు పేట వరకు కొనసాగనున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర.. చేగొమ్మ గ్రామంలో లంచ్ బ్రేక్, తల్లంపాడు గ్రామంలో రాత్రి బస.
* రేపు కొమురం భీం జిల్లా కు సీఎం కేసీఆర్.. పోడు భూములకు పట్టాల పంపిణీ చేయనున్న సీఎం.. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం.
* రాజన్న సిరిసిల్ల జిల్లా: తొలి ఏకాదశి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవతార్చనలు నిర్వహించిన ఆలయ అర్చకులు.. నేటి ఉదయం 6 గంటల నుండి రేపటి రోజు తెల్లవారుజాము వరకు స్వామివారికి అఖండ భజన, సాయంత్రం విఠలేశ్వర స్వామి వారికి మహా పూజ, స్వామివారి స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ
* కాకినాడ: తొలి ఏకాదశి సందర్భంగా అన్నవరం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు.. దర్బారు మండపంలో శ్రీమహావిష్ణువు అవతారంలో దర్శనం ఇవ్వనున్న సత్యదేవుడు. భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లు
* తిరుమల: ఇవాళ నుంచి జూలై 5వ తేదీ వరకు టీటీడీ పరిపాలన భవనం వద్ద చతుర్వేద హవనం కార్యక్రమం నిర్వహిస్తూన్న టీటీడీ..
* తిరుమల: రేపటి నుంచి మూడు రోజులు పాటు బర్డ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆపరేటివ్ ఆర్థో ప్లాస్టి సమ్మిట్.. హాజరుకానున్న 200 మంది ఆర్థోపెడిక్ డాక్టర్లు.. లైవ్ సర్జరీలు నిర్వహించనున్న 20 మంది ప్రముఖ డాక్టర్లు
* ప్రకాశం : పుల్లలచెరువు మండలం సుద్దకురవ తండాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
* బాపట్ల : పర్చూరు వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గం లోని ఆరు మండలాల ప్రజాప్రతినిధులతో ఇంచార్జీ ఆమంచి కృష్ణమోహన్ ప్రత్యేక సమావేశం..
* ప్రకాశం : ఒంగోలు కేశవస్వామిపేట లోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు..
* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన.. మధ్యాహ్నం 03:00 గంటలకు కొవ్వూరు క్యాంప్ ఆఫీస్ నందు జరుగు “జగనన్న సురక్ష ” అవగాహన సదస్సు లో పాల్గొంటారు.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య యాత్ర .. సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి పుష్కర ఘాట్ నుండి నగరంఅంతా బైక్ ర్యాలీ
* విశాఖ: నేడు దక్షిణ నియోజకవర్గంలో TDP భవిష్యత్తు కు గ్యారెంటీ-చైతన్య యాత్ర….
* పశ్చిమ గోదావరి: భీమవరం నిర్మల దేవి ఫంక్షన్ హాల్ లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్.. రేపు భీమవరం అంబేద్కర్ సెంటర్‌లో వారాహి బహిరంగ సభ.. రేపటి సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పవన్ పిలుపు..
* ఏలూరు: తొలి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని ప్రధాన ఆలయాలలో ప్రత్యేక పూజలు..
* మాడుగుల మండలం శంఖరం సచివాలయం పరిధిలోని శివారు గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు
* నేడు సత్తెనపల్లిలో టీడీపీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు యాత్ర… కొండమోడు నుండి ప్రారంభం కానున్న యాత్ర…
* పల్నాడు: నేడు సత్తెనపల్లి కాకతీయ కళ్యాణ మండపంలో మేధావుల సదస్సు…
* నేడు శ్రీశైలం మల్లన్నకు తొలి ఏకాదశి సందర్భంగా సహస్ర ఘటాభిషేకం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని దేవస్థానం చేస్తున్న అభిషేకం, సహస్ర ఘటాభిషేకం సందర్భంగా అన్ని అర్జిత సేవలు నిలుపుదల.. ఉదయం 9 నుండి 12 వరకు ఘటాభిషేకం, రోజంతా అభిషేక జలములోనే మల్లికార్జునుడి దర్శనం.. సహస్ర ఘటాభిషేకంలో పాల్గొననున్న మంత్రి కొట్టు సత్యనారాయణ, కమిషనర్
* తిరుపతి: లోక కల్యాణార్థం నేటి నుండి జులై 5వ తేదీ వరకు టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో శ్రీశ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహించనున్న టీటీడీ
* తూర్పుగోదావరి జిల్లా : తొలి ఏకాదశి సందర్భంగా జిల్లాలో భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు.. రాజమండ్రి దానవాయిపేటలోని పాండురంగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు
* విజయవాడఫ ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని నేడు ప్రారంభించనున్న కలెక్టర్ ఢిల్లీ రావు
* నేడు దుర్గగుడి పాలక మండలి సమావేశం.. ఆలయ అభివృద్ధి పనులపై చర్చ జరపనున్న పాలక మండలి
* విజయవాడ: జులై 3న ఇంద్రకీలాద్రి గిరి ప్రదిక్షణ నిర్వహించాలని నిర్ణయం