* అమరావతి: నేడు 8,912 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న సీఎం వైఎస్ జగన్.. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో సింగిల్ లేఅవుట్.. 8, 912 టిడ్కో ఇళ్లు పూర్తి..
* కాకినాడ: పవన్ కల్యాణ్ ఈ రోజు షెడ్యూల్.. ఉదయం 9 గంటలకు పిఠాపురం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో.. 10 గంటలకు కార్మిక, రైతు, చేతి వృత్తులవారితో సమావేశాలు.. 11 గంటలకు క్షేత్ర స్థాయి పరిశీలన.. సాయంత్రం 5 గంటలకు ఉప్పాడ సెంటర్‌లో బహిరంగ సభలో పాల్గొనున్న పవన్.. అనంతరం కాకినాడ చేరుకొని అక్కడే బస చేయనున్న జనసేనాని.
* అమరావతి: నేడు ‘ప్రాంతీయ జీఎస్టీ కార్యాలయాన్ని’ ప్రారంభించనున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. విజయవాడ ఆంధ్రా హాస్పిటల్ పక్కనున్న సెంట్రల్ గ్రావిటీ బిల్డింగ్ లో ఉదయం 9.30 గం.లకు మంత్రి బుగ్గన చేతుల మీదుగా కార్యాలయ ప్రారంభోత్సవం
* నేడు కాకినాడలో పార్టీ సమావేశాల్లో పాల్గొనున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్
* కాకినాడ: నేడు జేఎన్టీయూలో జరిగే కార్యక్రమంలో పాల్గొనున్న చిన జీయర్ స్వామి
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తోటపల్లి గూడూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* అనంతపురం : కళ్యాణదుర్గం మండలం హుళికల్లు పంచాయతీలోని గ్రామాల వ్తెసీపీ కార్యకర్తల సమావేశం. పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .
* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన.. ఉదయం 10 గంటలకు జగ్గంపేట నందు స్థానిక శాసనసభ్యులచే ఏర్పాటు చేసిన పి.హెచ్.సి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.. సాయంత్రం కొవ్వూరు టౌన్ 7వ వార్డు నందు జరుగు గడప గడపకు మన ప్రభుత్వం(109వ రోజు) కార్యక్రమంలో పాల్గొంటారు.
* పశ్చిమ గోదావరి: తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటన.. విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రిలో మంత్రి అంబటి రాంబాబు పర్యటన.. ఉదయం 10 గంటలకు మీడియా సమావేశం
* కర్నూలు: నేడు అదోనిలో బీజేపీ OBC మోర్చా భారీ బహిరంగ సభ.. పాల్గొననున్న OBC మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ , సోమువీర్రాజు
* చిత్తూరు: మూడో రోజు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. నేడు కార్యకర్తలతో సమావేశం కానున్న చంద్రబాబు
* నేడు మెదక్ జిల్లాలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయన్ పర్యటన.. మెదక్ జిల్లా కోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న హైకోర్టు సిజే.. మెదక్ చర్చ్ ని సందర్శించి, ఏడు పాయల అమ్మ వారిని దర్శించుకొనున్న ఉజ్జల్ భూయన్
* నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన. మంత్రి తో పాటు ఆర్టీసి సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్ పర్యటన.. బస్టాండ్ వద్ద దుకాణ సముదాయాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్న మంత్రి, చైర్మెన్.