* నేడు భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడో టీ20.. బెంగళూరు వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్.. మూడు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న భారత్
* తమిళనాడు: నేడు అలంగానల్లూరులో జల్లికట్టు పోటీలు.. ప్రారంభించనున్న మంత్రి ఉదయనిధి స్టాలిన్
* హైదరాబాద్: నేడు మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ ఎస్టీ విభాగం కార్యకర్త సమావేశం.. పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయటమే అజెండాగా సమావేశం
* నేడు, రేపు తిరుమల, తిరుపతిలో పురావస్తు శాఖ అధికారుల కమిటీ పర్యటన.. అలిపిరి దగ్గర ఉన్న పాదాల మండపం, తిరుమలలోని పుష్కరిణి వద్ద అహ్నిక మండపాలను పరిశీలించనున్న కమిటీ.. పునఃనిర్మాణానికి సంబంధించి టీటీడీకి సూచనలు చేయనున్న అధికారులు
* తిరుమల: 25 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,016 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 20,915 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు
* హైదరాబాద్: నేడు ధరణి సమస్యల కమిటీ రెండో సమావేశం.. పలు నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చే అవకాశం. సీసీఎల్‌ఏ కార్యాలయంలో భేటీ కానున్న ధరణి కమిటీ..
* ఏపీలో 37వ రోజు కొనసాగనున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు..
* ప్రకాశం: గిద్దలూరులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు..
* ప్రకాశం: దర్శిలో వైసీపీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్న నూతన ఇంచార్జీ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..
* ప్రకాశం: పుల్లలచెరువులో వైసీపీ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొననున్న యర్రగొండపాలెం నూతన వైసీపీ ఇంచార్జీ తాటిపర్తి చెంద్రశేఖర్..
* ప్రకాశం : మద్దిపాడులో మండల వైసీపీ నేతలతో సమీక్షా సమావేశంలో పాల్గొననున్న మంత్రి, నియోజకవర్గ నూతన ఇంచార్జీ మేరుగ నాగార్జున..
* విశాఖ: నేడు సింహాచలంలో స్వచ్ఛ భారత్.. పాల్గొననున్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రమేష్ బిధూరి, ఎంపీ జీవీఎల్
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరులోని బిజెపి జిల్లా కార్యాలయంలో. యువ మోర్చా నేతల సమావేశం
* శ్రీ సత్యసాయి: రొద్దం మండల పరిధిలోని పలు గ్రామాలలో పర్యటించనున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .
* అనంతపురం : పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో యువ చైతన్య బస్సు యాత్ర కార్యక్రమం ప్రారంభం.
* అనంతపురం : పెద్దవడుగూరు మండల కేంద్రంలోని చేనేత కాలనీ లో పర్యటించనున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
* అనంతపురం : ఇవాళ ఉమ్మడి జిల్లాల జడ్పీ సర్వసభ్య సమావేశం.
* అనంతపురం : నేటితో ముగియనున్న జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ రంగజనార్థన పదవీకాలం.
* డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : ఈనెల 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మండపేట నుండి తరలి వెళ్లిన కళ్యాణ కొబ్బరి బోండాలు.. నేడు కొబ్బరి బొండాలు అయోధ్యకు చేరిక. ఉత్సవ నిర్వహణ కమిటీకి బోండాలు సమర్పంచనున్న మండపేట వాసి
* దావోస్ ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం.. ‘సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (సీ4ఐఆర్)’ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం.. ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సులో ప్రారంభం.. వేదిక అధ్యక్షుడు బర్గె బ్రెండ్, సీఎం రేవంత్‌రెడ్డి సంయుక్త ప్రకటన
* నంద్యాల: నేడు శ్రీశైలంలో 6వ రోజు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. ఉదయం పూర్ణాహుతి, త్రిశూలస్నానం.. సాయంత్రం ధ్వజావరోహణం.. రేపటితో ముగియనున్న మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
* నంద్యాల: బనగానపల్లె లోని కొండపేటలో కమ్యూనిటీ హల్ ను నేడు ప్రారంభించనున్న చేయనున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి