* నేడు భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి టీ20 మ్యాచ్.. మొహాలీ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్
* ఇజ్రాయెల్ యుద్ధ నేరంపై నేటి నుంచి అంతర్జాతీయ కోర్టులో విచారణ
* హైదరాబాద్: రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ.. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.. ఈ నెల 29న పోలింగ్, సాయంత్రం ఫలితాలు
* ఆంధ్రప్రదేశ్‌లో 31వ రోజు కొనసాగనున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు..
* ఖమ్మం: నేడు సత్తుపల్లి మండలం యతాలకుంట గ్రామం వద్ద సీతారామ ప్రాజెక్టు టన్నెల్ ను పరీశీలించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి.. సీతా రామ పనుల పురోగతి టన్నుల నిర్మాణంపై అధికారులతో రివ్యూ
* ప్రకాశం : ఒంగోలులో పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాకూర్, పలువురు ఏఐసీసీ ప్రతినిధులు.. అద్దంకి బస్టాండ్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించనున్న కాంగ్రెస్ శ్రేణులు.
* ప్రకాశం: దర్శిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండలాగుడు పోటీలు, కార్యక్రమానికి హాజరుకానున్న పలువురు మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు..
* శ్రీ సత్యసాయి : పుట్టపర్తి హల్ వ్యూ స్టేడియంలో నేడు సత్యసాయి విద్యా సంస్థల సాంస్కృతిక క్రీడోత్సవాలు.. తరలి వచ్చిన విద్యార్థులు.
* అనంతపురం : గుంతకల్ రైల్వే డివిజన్ మీదుగా సంక్రాంతి పండుగకు తిరుపతి- కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు ప్రయాణం.
* తిరుమల: 17, 18వ తేదీలలో ఆర్కియాలజీ శాఖ అధికార్లు తిరుమల పర్యటన.. అలిపిరి పాదాల మండపం, పుష్కరిణి వద్ద వున్న అహ్నిక మండపం పునఃనిర్మాణంపై టీటీడీ సూచనలు చెయ్యనున్న ఆర్కియాలజీ అధికార్లు
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరులో జనసేన సిటీ విభాగ నేతల సమావేశం
* నెల్లూరు రూరల్ పరిధిలోని నేతాజీ నగర్ లో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ కార్యక్రమాల వివరాలు.. జంగా జాన్సన్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు, జగన్నన్న తోడు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల వాలంటీర్లతో ఆత్మీయ సమావేశం…
* ఏపీలో సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు.. నేటి నుంచి యథావిధిగా విధుల్లో చేరిన మున్సిపల్ కార్మికులు.. సమ్మె కారణంగా రోడ్లపై పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగిస్తున్న మున్సిపల్ కార్మికులు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. మధ్యాహ్నం 2 గంటలకు చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో చాగల్లు నుండి లక్ష్మీపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
* కాకినాడ: నేడు కిర్లంపూడిలో ముద్రగడను కలవనున్న టీడీపీ నేత జ్యోతుల నెహ్రు.. టీడీపీ, జనసేన కూటమితో కలిసి పని చేయాలని ముద్రగడను కోరనున్న నెహ్రూ
* గుంటూరు: ఈ నెల 14, 15వ తేదీల్లో గుంటూరు కార్పొరేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు…
* పల్నాడు: సంక్రాంతి వేడుకల్లో భాగంగా, ఈ నెల 12 నుంచి 17 వరకు ఈపూరు మండలం ముప్పాళ్ళ లో రైతు మిత్ర జాతీయస్థాయి కబడ్డీ పోటీలు….
* కాకినాడ: కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి రెండు మూడు రోజుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లే అవకాశం.. ముద్రగడను జనసేన పార్టీ లోకి ఆహ్వానించనున్న పవన్
* శ్రీ సత్యసాయి : లేపాక్షి మండలంలో నాల్గవ రోజు పంచాయతీల్లో జరిగే సమావేశాల్లో పాల్గొననున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
* తిరుమల: 2 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,449 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 18,555 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు