1. ఏపీలో నేడు లబ్దిదారులకు సంక్షేమపథకాల నిధుల విడుదల. సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులకు ఉదయం 11 గంటలకు నిధులు విడుదల చేయనున్న జగన్. రూ.216.34 కోట్లను బటన్ నొక్కి విడుదల చేయనున్న సీఎం.
2. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,230 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,300 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.78,500 లుగా ఉంది.
3. కరీంనగర్ : బీఆర్‌ఎస్‌కు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ రాజీనామా. భవిష్యత్ కార్యాచరణపై నేడు అనుచరులతో సమావేశం.
4. నేడు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ విడుదల. నవంబర్ నెల టికట్లను విడుదల చేయనున్న టీటీడీ. రేపు తిరుమలలో వసతి బుకింగ్ టికెట్ల విడుదల.
5. ఆసక్తి రేపుతున్న చెస్ ప్రపంచ కప్ ఫైనల్. నిన్న ఇద్దరి మధ్య రెండో గేమ్ కూడా డ్రా. టైటిల్ కోసం మాగ్నస్ కార్ల్‌సన్‌తో ప్రజ్ఞానంద్ పోరు. ఫైనల్‌లో నేడు తలపడనున్న కార్ల్‌సన్, ప్రజ్ఞానంద్.
6. నేడు తెలంగాణ కేబినెట్ విస్తరణ. మధ్యాహ్నం 3.30 గంటలకు మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణం.
7. నేడు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు. నేడు మంత్రుల ఘెరావ్ కార్యక్రమం. రేపు కలెక్టరేట్లను ముట్టడించనున్న బీజేపీ నేతలు. సెప్టెంబర్ 7న బీజేపీ చలో హైదరాబాద్.
8. టికెట్ రాకపోవడంపై మోత్కుపల్లి అసంతృప్తి. నేడు యాదగిరిగుట్టలో అనుచరులతో సమావేశం. భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం.
9. నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఏఐసీసీ పార్లమెంట్ పరిశీలకుల సమావేశం. ఇన్‌చార్జ్ ఠాక్రే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం. 2 వారాలుగా నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించిన పరిశీలకులు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిస్థితులపై సమీక్ష.