నేడు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించనున్న సీఎం.
ప్రొ కబడ్డీలో నేటి మ్యాచ్‌లు.. రాత్రి 8 గంటలకు గుజరాత్ వర్సెస్ ఢిల్లీ. రాత్రి 9 గంటలకు పుణెరి-తమిళ్ తలైవాస్.
ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ విచారణ. నేడు దానకిషోర్ స్టేట్‌మెంట్ రికార్డు చేసే అవకాశం. మరి కొంతమంది అధికారులను విచారించనున్న ఏసీబీ.
కేటీఆర్‌కు నేడు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం. ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఈడీ.
నేడు పెనమలూరు నియోజకవర్గంలో పవన్ పర్యటన. కంకిపాడులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. మధ్యాహ్నం 12 గంటలకు గుడివాడలో పవన్ పర్యటన.
హైదరాబాద్‌లో నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన. ఉదయం 9 గంటలకు పీవీ జ్ఞానభూమిలో కేంద్రమంత్రి నివాళులు. ఉదయం 10 గంటలకు రోజ్‌గార్ మేళా కార్యక్రమానికి హాజరు. మధ్యాహ్నం 1.30 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటన.
ఇంద్రకీలాద్రిపై మూడో రోజు భవాని దీక్ష విరమణలు. తెల్లవారుజామున 3 గంటల నుంచి కొనసాగుతున్న దర్శనాలు. నిన్న దుర్గమ్మను దర్శించుకున్న 57 వేల మంది భక్తులు.
నేడు మెదక్ జిల్లాలో మాజీమంత్రి హరీష్‌రావు పర్యటన. మెదక్ చర్చి శతవసంతాల వేడుకలకు హాజరుకానున్న హరీష్.
నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం. కోల్‌మైన్స్‌లో సింగరేణి కార్మికుల వేడుకలు.
నేడు బ్యాంకర్ల సమావేశం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం.
తిరుమల: ఇవాళ, రేపు ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదల. ఇవాళ ఉదయం 11 గంటలకు శ్రీవారి దర్శన టికెట్లు విడుదల.