నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన. ఉదయం 10 గంటలకు కర్నూలులో కేంద్ర న్యాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన. ఉదయం 11.30 గంటలకు బనగానపల్లెకు సీఎం జగన్. 100 పడకల ఏరియా ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్. తర్వాత అనంతపురం బహిరంగ సభలో పాల్గొననున్న జగన్.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,830 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ. 60,340 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.78,840 లుగా ఉంది.
నేడు తెలంగాణలో సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ కానున్న కేబినెట్ సభ్ కమిటీ. 317, 46 జీవోలపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకోనున్న కమిటీ.
నేటితో ముగియునున్న గ్రూప్-1 దరఖాస్తు గడువు. ఇప్పటివరకు వచ్చిన 2.7 లక్షల అప్లికేషన్లు.
నేడు గంటా శ్రీనివాసరావు నివాసంలో కీలక సమావేశం. ముఖ్యనేతలతో రాజకీయ భవిష్యత్‌కు చర్చించనున్న గంటా. చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సపై పోటీ చేయాలని గంటాకు హైకమాండ్ ఆదేశం. నిన్న చంద్రబాబును కలిసి విశాఖ జిల్లాలో సీటు ఇవ్వాలని కోరిన గంటా. పోటీ చేస్తే చీపురుపల్లి లేదంటే పార్టీ కోసం పనిచేయాలన్న హైకమాండ్. చీపురుపల్లి పోటీపై ఆసక్తి చూపని గంటా. అనుచరులతో సమావేశం తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న గంటా.
నేడు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటన. మెజారిటీ స్థానాలు ప్రకటిస్తామన్న చంద్రబాబు. పలు లోక్ సభ స్థానాలకు కూడా అభ్యర్థుల ప్రకటన. మొదటివిడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.
నేడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీ సమన్వయ కమిటీ భేటీ. హాజరుకానున్న వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స, నేతలు.
అభ్యర్థుల ఎంపికపై జనసేన పార్టీ కసరత్తు. నేడు జనసేన తుది జాబితా విడుదల చేసే అవకాశం. 15స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం. ఇప్పటికే 6 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన పవన్. పవన్ కల్యాణ్ పోటీపై నేడు స్పష్టత వచ్చే ఛాన్స్.
రేపు హైదరాబాద్‌లో ప్రధాని మోడీ రోడ్ షో. మోడీ పర్యటన నేపథ్యంలో నేడు బీజేపీ సన్నాహక సమావేశం. విశాఖజిల్లాలో సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరిన గంటా.
నేడు ఢిల్లీలో కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్. రాంలీలా మైదానంలో రైతు సంఘాల సభ.