NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే.?

Whats Today

Whats Today

నేడు ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్‌. ఫార్ములా ఈ రేస్‌ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్‌. విచారణకు లాయర్‌ను తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతి. ఏసీబీ ఎంక్వయిరీ సర్వత్రా ఉత్కంఠ. నిన్న 7 గంటల పాటు అరవింద్‌ కుమార్‌ ఏసీబీ విచారణ. BLNరెడ్డిని 9 గంటలు ప్రశ్నించిన ఈడీ.

వనపర్తి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. వనపర్తి నియోజకవర్గంలో పలు సబ్‌ స్టేషన్లను ప్రారంభించనున్న భట్టి.

కృష్ణా: పోలీసుల కస్టడీ పిటిషన్‌పై నేడు జిల్లా కోర్టులో విచారణ. రేషన్‌ బియ్యం కేసులో నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్‌. ఒకరోజు కస్టడీలో సరైన సమాధానాలు రాకపోవటంపై మరోసారి కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌. పేర్నినాని భార్య జయసుధకు మరోసారి నోటీస్‌ ఇచ్చి విచారణకు పిలవాలని నిర్ణయం.

తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,830 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,260లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,900 లుగా ఉంది.

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. డీజీపీ, టీటీడీ చైర్మన్‌తో చంద్రబాబు టెలికాన్ఫిరెన్స్‌. అధికారుపలై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ఉదయం 11 గంటలకు తిరుపతికి చంద్రబాబు. రుయా, స్విమ్స్‌లో క్షతగాత్రులతో పాటు బాధిత కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు. టీటీడీ ఈవోతో సమీక్ష నిర్వహించనున్న చంద్రబాబు.

తిరుపతికి బయలుదేరిన ముగ్గురు మంత్రులు. సీఎం ఆదేశాలతో తిరుపతికి మంత్రులు అనిత, ఆనం, అనగాని. తిరుపతి ఘటన బాధాకరం. మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం, మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.

తెలంగాణపై చలి పంజా. అత్యంత కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు. పటాన్‌చెరులో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత.

తిరుపతి, తిరుమలలో యథావిధిగా టోకెన్ల జారీ. మూడు రోజులకు లక్షా 20 వేల టోకెన్లు జారీ. తర్వాత నుంచి రోజుకు 40 వేల టోకెన్ల జారీ. రోజుకు 70 వేల మందికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం. పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు.

ఈరోజు రాత్రి కర్నూలుకు మంత్రి లోకేశ్‌. రేపు పలు స్కూళ్లు, కళాశాలను సందర్శించనున్న లోకేశ్‌.

Show comments