ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం. రక్షణమంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ.
HYD: భారత సైన్యానికి మద్దతుగా నేడు సంఘీభావ ర్యాలీ. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్‌రోడ్ వరకు ర్యాలీ. సాయంత్రి 6 గంటలకు ర్యాలీ ప్రారంభించనున్న సీఎం రేవంత్.
నేడు ఏపీ కేబినెట్ సమావేశం. సబ్ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలపనున్న కేబినెట్. అమరావతి రీ-లాంచ్ ప్రాజెక్టులతో పాటు పలు పరిశ్రమలకు స్థలాల కేటాయింపుపై చర్చ. సీఎం చంద్రబాబు అధ్యక్షత ఉదయం 11 గంటలకు భేటీ. మోడీ ధన్యవాదాలు తెలపనున్న కేబినెట్.
అమరావతి: నేడు తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో సమావేశం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ కానున్న వైసీపీ అధినేత జగన్.
తిరుమల: నేటితో ముగియనున్న పద్మావతి పరిణయోత్సవాలు. గరుడ వాహనంపై మలయప్పస్వామి ఊరేగింపు.
నేడు తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలెర్ట్. ఏపీలో కొనసాగుతున్న విభిన్న వాతావరణ పరిస్థితులు.
నేడు ఏపీలో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు. 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. గరిష్ట ఉష్ణోగ్రతలు 40-42 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం. ఎల్లుండి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం.
నేడు కోల్ ఇండియా ఆధ్వర్యంలో తలసీమియా డే. కార్యక్రమంలో పాల్గొనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
నేడు హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ప్రారంభం. ఆరుగురు ఇన్స్‌స్పెక్టర్లు, 12 మంది ఎస్సైలతో పీఎస్. పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్.
నేడే పీఎస్‌ఆర్ను కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు. ఏపీపీఎస్సీ కేసులో పీటీ వారెంట్‌పై కోర్టుకు హాజరు.
జత్వానీ కేసులో ఐపీఎస్‌ల పిటిషన్‌పై నేడు విచారణ. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన ఐపీఎస్‌లు.
