1. నేడు ఢిల్లీ వెళ్లనున్న నారా లోకేష్. సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు నేపథ్యంలో మరోసారి ఢిల్లీ వెళ్లనున్న నారా లోకేష్.
2. చంద్రబాబు అరెస్ట్‌పై వినూత్న నిరసన. నేడు కాంతితో క్రాంతి కార్యక్రమానికి టీడీపీ పిలుపు. రాత్రి 7 గంటలకు ఇళ్లల్లో లైట్లు ఆర్పి నిరసన. ఇంటి బయట క్యాండిల్ లేదా టార్చ్ వేయాలని పిలుపు. బైక్‌లు, కార్ల హెడ్‌లైట్లు ఆన్, ఆఫ్ చేస్తూ నిరసన.
3. గుంటూరులో నేడు జనసేన ధర్మాగ్రహ శాంతి ప్రదర్శన. అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ. శాంతి ప్రదర్శనలో పాల్గొననున్న వామపక్ష పార్టీలు.
4. వరల్డ్‌కప్ టోర్నీలో నేడు ఉదయం 10.30 గంటలకు బంగ్లాదేశ్‌తో ఆఫ్ఘనిస్తాన్ ఢీ. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీలంతో తలపడనున్న సౌతాఫ్రికా.
5. నేడు ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్ ఫైనల్ మ్యాచ్.
6. హైదరాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,230 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,500 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.73 వేలుగా ఉంది.
7. నేడు ఏపీకి రానున్న సీఎం జగన్. ఢిల్లీ పర్యటన ముగించుకొని ఏపీకి సీఎం జగన్ రానున్నారు.
8. తూర్పుగోదావరి జిల్లా : నేడు 28వ రోజుకు చేరిన రాజమండ్రి సెంట్రల్ జైలులోని టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు. ఈనెల 19వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్.
9. మంచిర్యాలలో నేడు జిల్లా లో మంత్రి హరీష్ రావు పర్యటన. మంచిర్యాల, చెన్నూర్ నియోజక వర్గాల్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్న మంత్రి హరీష్ రావు. దొనబండలో బహిరంగ సభ, చెన్నూరులో రోడ్ షో లో పాల్గొననున్న మంత్రి హరీష్.
10. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పై కొనసాగుతున్న ఊగిసలాట. నేటి తో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ గడువు. ఒక వైపు నామినేషన్ ల స్వీకరణ. ఎన్నికలు ఆపాలంటూ మరో వైపు హై కోర్టు డివిజన్ బెంచ్ ని ఆశ్రయించిన సింగరేణి యాజమాన్యం. మొదటి రోజు నామినేషన్ దాఖలు చేసిన 10 కార్మిక సంఘాలు. ఇవ్వాళ మరో 4 సంఘాలు నామినేషన్ దాఖలు చేసే అవకాశం. ఈనెల 11 డివిజన్ బెంచ్ లో ఎన్నికల వాయిదా కేసు విచారణకు వచ్చే అవకాశం.
11. నేడు కామారెడ్డి జిల్లాలో ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల గ్రౌండులో కేటీఆర్ సభ. 10 వేల మందితో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహణ. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ టూర్ కు ప్రాధాన్యం. బహిరంగ సభ కు ఏర్పాటు పూర్తి.