1. నేటి నుంచి రేషన్ షాపుల్లో రూ.60కే టమోటా. తమిళనాడులో రూ.150కి చేరువలో కిలో టమోటా.
2. నేడు బెంగళూరులో శాప్ చాంపియన్‌షిప్ ఫైనల్స్. ఫైన్సల్స్‌లో కువైట్‌తో తలపడుతున్న భారత్.
3. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్. రేపు ప్రధాని మోడీతో భేటీ కానున్న జగన్. అమిత్‌షా సహా కేంద్రమంత్రులను కలిసే అవకాశం.
4. నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు. తెలంగాణలో 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. నిజామాబాద్, జగిత్యాల, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట. మహబూబ్‌నగర్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌లో వర్షాలు.
5. నేడు చిత్తూరు సీఎం జగన్ పర్యటన. ఉదయం 10.00 గం.లకు మెసానికల్ గ్రౌండ్స్, చిత్తూరు చేరుకోనున్న సీఎం జగన్. ఉ.10.30 గం. లకు చిత్తూరు డెయిరీ –అమూల్ డెయిరీ శంఖు స్థాపన, భూమి పూజ. ఉ.10.55 గం. లకు చిత్తూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ – ఫోటో సెషన్, ఎగ్జిబిషన్, పబ్లిక్ మీటింగ్. మ.01.05 గం. లకు సిఎంసి ఆసుపత్రి ఆవరణలో 300 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన. మ.01.30 గం. లకు సిఎంసి ఆసుపత్రి హెలిప్యాడ్ నుండి రేణిగుంట పయనం… రేణిగుంట నుండి విజయవాడ పయనం.
6. నేడు హోం మంత్రి తానేటి వనిత ఉదయం 10.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో జెడ్‌పీహెచ్ స్కూల్ నందు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నివాళులర్పించి తదనంతరం జగనన్న సురక్ష కార్యక్రమం మరియు జగనన్న అమ్మఒడి కార్యక్రమం లో పాల్గొంటారు.
7. నేడు హైదరాబాద్ కు సునీల్ భన్సల్.. పార్టీ నేతలతో కీలక భేటీ
8. నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి నగరానికి వస్తున్నారు.
9. నేటి నుంచి కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగనున్న పీవీ సింధు. తొలి రౌండ్‌లో తాలియాతో తలపడనున్న పీవీ సింధు.
10. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,960 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,050 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.75,500 లుగా ఉంది.