* నేటి సాయంత్రంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర, ఎన్నికల బరిలో 2,290 మంది.. వారిలో మహిళలు 221, రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు, భద్రతా విధుల్లో 45వేల మంది తెలంగాణ పోలీసులు, నేటి సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోనూ ప్రకటనలకు అనుమతి లేదు-ఈసీ
* పోలింగ్‌కు 48 గంటల ముందే రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. సమావేశాలు, ఇంటింటి ప్రచారం లాంటివి చేయవద్దని ఈసీ సూచన.. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేది సాయంత్రం 5 గంటల వరకు సైలెంట్ పీరియడ్‌లో టీవీ, సోషల్ మీడియాలో ప్రకటనలకు అనుమతి లేదు.
* వేరే నియోజకవర్గం నుంచి ప్రచారానికి వచ్చిన వాళ్లు స్థానికంగా ఉండకూడదని, లాడ్జ్‌లు, గెస్ట్ హౌస్‌లు, హోటల్‌లో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశాలు
* నేడు హైదరాబాద్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రోడ్ షో, కార్నర్ మీటింగ్స్.. 10 గంటలకు జూబ్లీహిల్స్, మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లి, మధ్యాహ్నం 2 గంటలకు మల్కాజ్‌గిరి ఆనంద్ బాగ్ చౌరస్తాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రాహుల్
* నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
* నేడు సంగారెడ్డి జిల్లాలో AICC సెక్రటరీ ప్రియాంక గాంధీ పర్యటన.. జహీరాబాద్ లో జరిగే కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్న ప్రియాంక గాంధీ
* నేడు మెదక్, సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. చేగుంట, సిద్దిపేటలో రోడ్ షో లో పాల్గొననున్న మంత్రి హరీష్
* నేడు తెలంగాణలో బీజేపీ నేతల ప్రచారం.. హనుమకొండ బీజేపీ అభ్యర్థి శ్రీమతి రావు పద్మ మద్దతుగా కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి గారు విస్తృత ప్రచారం, నిజామాబాద్ అర్బన్ లో తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామలై ప్రచారం, సంగారెడ్డి నియోజకవర్గంలో కేంద్రమంత్రి భగవత్ ఖూబ జీ ప్రచారం, దేవరకొండ, పాలకుర్తి, నర్సంపేటలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ విస్తృత ప్రచారం, ఆదిలాబాద్, ధర్మపురి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే
* ప్రకాశం : పుల్లలచెరువు మండలం రంగన్నపాలెంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను శంకుస్థాపనను తాడేపల్లి క్యాంపు కార్యాలయంనుండి వర్చువల్ గా సీఎం జగన్ ప్రారంభించనున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున..
* ఒంగోలులో మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి సందర్భంగా కొత్త కూరగాయల మార్కెట్ సెంటర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్న కలెక్టర్ దినేష్ కుమార్
* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా
* నెల్లూరు జిల్లా: వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు
* నెల్లూరులోని పూలే సెంటర్లో ఆత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించనున్న నేతలు కార్యకర్తలు
* నెల్లూరు లోని టిడిపి జిల్లా కార్యాలయంలో గూడూరు నేతల సమావేశం
* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుండి ప్రజల భద్రత, రక్షణ ధ్యేయంగా జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు.. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు అంతట విజిబుల్ పోలీసింగ్ నిర్వహణ.. పరిమితి మించి స్కూలు పిల్లలను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ల పై కఠిన చర్యలు.
* అంబేద్కర్ కోనసీమ జిల్లా : నేడు యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర .. 211వ రోజు షెడ్యూల్‌లో భాగంగా నేడు అమలాపురం నుండి ముమ్మిడివరం వరకు సాగనున్న పాదయాత్ర.. ఉదయం 8 గంటలకు పేరూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.. ముమ్మిడివరం ఉమెన్స్ కాలేజీ వద్ద విడిది కేంద్రంలో రాత్రి బస చేయనున్న లోకేష్
* శ్రీకాకుళం జిల్లా: పోలాకి మండలం, బెలమర – పాలవలస గ్రామ సచివాలయంలో జరిగే సంక్షేమ పథకాల బోర్డు ఆవిష్కరణ.. మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమం ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పాల్గొంటున్నారు.
* అనకాపల్లి జిల్లా: నేడు అచ్యుతాపురం సెజ్ లో 400KV విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ.. వర్చువల్ విధానంలో శంఖుస్థాపన చేయనున్న సీఎం జగన్.. సుమారు 700 కోట్ల రూపాయలతో జరగనున్న సబ్ స్టేషన్ నిర్మాణం.
* విజయనగరం: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జిల్లా పర్యటన.. తోటపాలెంలో గల సాయి బాలాజీ ఫంక్షన్ హాలు నాయకులతో సమావేశం..
* విజయనగరం: జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ వద్దనున్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించనున్న కార్యక్రమాన్ని గౌరవ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి..
* శ్రీకాకుళం: ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటన.. పొందూరు మండలం భగవాన్ దాసుపేట మరియు కేశవదాసు పురం గ్రామలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.. ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయం లో హౌసింగ్ మరియు పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.
* శ్రీ సత్యసాయి: లేపాక్షి మండలంలోని నాయనపల్లి, సిరివరం, పూలకుంట పాఠశాలలకు 5 లక్షలు విలువచేసే డెస్క్టాప్ కంప్యూటర్స్, ప్రింటర్స్, ఎల్ఈడి టీవీలను పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర.
* అనకాపల్లిలో ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి అమర్నాథ్.. సాయంత్రం నెల్లిమర్లలో జరిగే బస్సు యాత్రకు హాజరయ్యే అవకాశం.. రాత్రికి విజయవాడ వెళ్లనున్న అమర్నాథ్
* అనంతపురం: కళ్యాణదుర్గం పట్టణంలోని కంబదూరు రోడ్డులో కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గరుడాపురం 33/11 KV విద్యుత్ ఉపకేంద్రంను ఫ్రారంభించనున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .
* దక్షిణ అండమాన్ తీరంలో బలపడుతున్న అల్పపీడనం.. డిసెంబర్ 1వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడుతుందని ఐఎండీ అంచనా.. తుఫాన్ మరింత బలపడుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం..
* గుంటూరు జిల్లా: ప్రత్తిపాడు తాసిల్దార్ కార్యాలయంలో అసైన్డ్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్ననున్న ప్రత్తిపాడు శాసన సభ్యురాలు మేకతోటి సుచరిత..
* అల్లూరి ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత.. దట్టంగా కురుస్తున్న పొగ మంచు.. పాడేరులో 13, మినుములూరు వద్ద 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు..
* గుంటూరు: నేడు గుజ్జన గుళ్ళ జిల్లా ఉపాధి కార్యాలయం లో జాబ్ మేళా..
* గుంటూరు: నేడు గుంటూరు ఎన్జీవో కళ్యాణ మండపం లో టిడిపి ఆద్వర్యంలో బిసి సంఘాల సమావేసం..
* తిరుమల: 4 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 58,176 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 20,157 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు