ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవర. 2024 లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ సాధించింది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొరటాలకు సూపర్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది. అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కు టాలివుడ్ లో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను తన ఖాతలో వేసుకుంది. భారీ నెగిటివిటిని సైతం తట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది దేవర. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు.
Also Read : PEDDI OTT Rights : రామ్ చరణ్ – బుచ్చి ‘పెద్ది’ డిజిటల్ రైట్స్.. ఎన్ని కోట్లు పలికాయంటే
కానీ ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతుంది. అటు ఎన్టీఆర్ కూడా ఈ సినిమా తప్ప ఇతర సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఈ నేపధ్యంలోనే దేవర 2 లేదని క్యాన్సిల్ చేసేశారని న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే గతంలో జరిగిన ఓ సినిమా వేడుకలో దేవర 2 ఉంటుందని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు. అయినా సరే దేవర 2 పై గాసిప్స్ మాత్రం ఆగడం లేదు. ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ సీక్వెల్ వార్ 2 బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడంతో దేవర 2పై అనుమానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా ఈ చిత్ర మేకర్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం దేవర 2 ఖచ్చితంగా ఉంటుందట. సిక్వీల్ కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా కొరటాల ఎప్పుడో ఫినిష్ చేసేసారు. ఎన్టీఆర్ కు కథ వినిపించడం ఛేంజెస్ చేయడం కూడా జరిగిందట. వార్ 2 కారణంగా భారీ ఫ్లోప్ చుసిన ఎన్టీఆర్ సీక్వెల్స్ ఇప్పుడు వద్దని దేవర 2 ను అలా పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత త్రివికమ్ డైరెక్షన్ లో సినిమా ఉంది. నెల్సన్ సినిమా కూడా చేయాల్సిఉంది. ఈ మూడు సినిమాల తర్వాత దేవర 2 ఉండే ఛాన్స్ ఉంది కానీ పూర్తిగా ఈ సినిమానైతే క్యాన్సిల్ చేయలేదు.