China Zero Covid Policy: చైనా జీరో-కొవిడ్ పాలసీని ఎత్తేస్తే.. 20 లక్షల మంది చనిపోతారట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Zero Covid Policy: చైనా జీరో కొవిడ్ విధానంపై ఆ దేశ పౌరుల నుంచి నిరసన వ్యక్తం అవుతుండడంతో ఆంక్షలు సడలించాలని డ్రాగన్ సర్కారు చూస్తోంది. ఆ దేశం జీరో కొవిడ్ విధానాన్ని సులభతరం చేయడానికి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. జీరో-కొవిడ్ పాలసీని ఎత్తేస్తే లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని పరిశోధకులు చెబుతున్నారు. పూర్తి స్థాయి ఆంక్షలు ఎత్తివేస్తే ఎదురయ్యే పరిణామాల పట్ల చైనాలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండడం వంటివి అందుకు కారణాలని చెబుతున్నారు. శుక్రవారం నాటికి చైనాలో 5,233 కొవిడ్ సంబంధిత మరణాలు సంభవించగా.. 3.31 లక్షల మందిలో కొవిడ్ లక్షణాలు కనిపించాయి.
హాంకాంగ్ మాదిరిగా కొవిడ్ నియంత్రణలను సడలిస్తే చైనా 2 మిలియన్లకు పైగా మరణాలను ఎదుర్కొంటుందని నైరుతి గ్వాంగ్జీ ప్రాంతంలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెడ్ జౌ జియాటాంగ్ గత నెలలో షాంఘై జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రచురించిన పేపర్‌లో చెప్పారు. అలాగే కొవిడ్ కేసులు 23 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. చైనా, అమెరికా చెందిన పరిశోధకులు మేలో ఓ అంచనా వేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయకుండా, ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుపర్చకుండా జీరో కొవిడ్ పాలసీ నుంచి చైనా పూర్తిగా వైదొలిగితే దాదాపు 15 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. నేచర్ మెడిసిన్‌లో ప్రచురించబడిన పరిశోధనలో వారు వెల్లడించారు. టీకాపై దృష్టి సారిస్తే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని చైనాలోని ఫుడాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, ప్రధాన రచయితలు తెలిపారు. కొవిడ్ దశ పీక్‌కు చేరినప్పుడు ఇన్సింటివ్ కేర్‌లకు 15 రెట్ల డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
Also Read
Bharat Jodo Yatra:భారత్ జోడో యాత్రలో కంప్యూటర్ బాబా.. పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ దూరం!
వ్యాక్సినేషన్, బూస్టర్ రేట్ తక్కువగా ఉండడం, హైబ్రిడ్ ఇమ్యూనిటీ లేకపోవడం వంటి కారణాల వల్ల చైనా తన జీరో-కోవిడ్ విధానాన్ని ఎత్తివేస్తే 13 లక్షల నుంచి 21 లక్షల మంది చనిపోతారని బ్రిటిష్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలటిక్స్ కంపెనీ ఎయిర్‌ఫినిటీ సోమవారం తెలిపింది. హాంకాంగ్‌లో ఫిబ్రవరిలో సంభవించిన బీఏ.1 వేవ్‌ను పరిగణనలోకి తీసుకుని అంచనా కట్టినట్లు వెల్లడించింది.
తాజావార్తలు
-
Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
-
Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
-
WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
-
Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!