భారతదేశంలో ఓ ఐఏఎస్ అధికారి ర్యాంక్, ఎక్స్పీరియన్స్ ఆధారపడి జీతం ఉంటుంది. 7వ పే కమిషన్ ప్రకారం, ఓఐఏఎస్ అధికారి ప్రాథమిక వేతనం రూ. నెలకు 56,100 నుండి క్యాబినెట్ సెక్రటరీ పదవికి నెలకు రూ. 2,50,000 వరకు ఉంటుంది. ఇక ఈ ప్రాథమిక వేతనంతో పాటు, ఐఏఎస్ అధికారులు డియర్‌నెస్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ ఇలా అనేక ఇతర ప్రత్యేక అలవెన్స్ లు కూడా వారు పొందుతారు. ఓ ఐఏఎస్ అధికారి జీతం.., పోస్టింగ్ చేసే నగరం, రాష్ట్రం, అలాగే వారి పని తీరుపై ఆధారపడి ఉంటుంది.
Also Read: Sunil Narine : ఒక్క సెంచరీ.. ఎన్ని రికార్డులో..
ఇక వివిధ ర్యాంకుల్లో ఉన్న ఐఏఎస్ అధికారి ప్రాథమిక వేతనం ఇలా ఉంటాయి. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)కు రూ. 56,100, జిల్లా మేజిస్ట్రేట్ (DM) కు రూ. 67,700, డివిజనల్ కమీషనర్ కు రూ. 87,100, ప్రిన్సిపల్ సెక్రటరీ కు రూ. 1,12,400, ప్రధాన కార్యదర్శికు రూ. 1,31,100, క్యాబినెట్ సెక్రటరీకు రూ. 2,50,000 లుగా వేతనాలను ఐఏఎస్ అధికారులు అందుకుంటారు. ఇకపోతే ప్రాథమిక జీతం అనేది ఓ ఐఏఎస్ అధికారి మొత్తం జీతంలో ఒక భాగం మాత్రమే. పొందే అలవెన్సులు, ఇంకా ఇతర ప్రయోజనాలను బట్టి అసలు జీతం కాస్త ఎక్కువగా ఉంటుంది.
Also Read: Janasena: జనసేన అభ్యర్థులకు బీ-ఫారాలు అందించిన పవన్ కళ్యాణ్
ఇక ఐఏఎస్ అధికారులు అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు. ఇక వాటి వివరాలు చూస్తే.. ప్రభుత్వ వసతి, జీవిత బీమా, ఇతర ఆర్థిక ప్రయోజనాలు, డ్రైవర్‌తో అధికారిక వాహనం, వైద్య వసతులు, ఇంకా భద్రత అలాగే కొన్ని సార్లు ఇతర ప్రోత్సాహకాలు లాంటివి వీరికి అదనంగా లభిస్తాయి.