ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా మంగళవారం నాడు జరిగిన మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రాజస్థాన్ రాయల్స్ చివరి వరకు పోరాడి విజయం సాధించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున సునీల్ నరైన్ సెంచరీ చేయగా.. రాజస్థాన్ రాయల్స్ తరఫున బట్లర్ సెంచరీ సాధించాడు. ఇకపోతే కలకత్తా నైట్ రైడర్స్ కి మొదటి బ్యాటింగ్ చేయగా ఓపెనర్ గా వచ్చిన సునీల్ నరైన్ తన ఐపిఎల్ కెరీర్ లో మొదటి సెంచరీని సాధించాడు. ఈ ఒక్క సెంచరీతో సునీల్ నరైన్ అనేక రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు.
Also read: Pemmasani Chandrashekar: అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి..
17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో సరికొత్త రికార్డును కూడా క్రియేట్ చేశాడు ఈ వెస్టిండీస్ మాజీ ఆటగాడు. రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చి కేవలం 49 బంతుల్లో సెంచరీ సాధించాడు. మొత్తంగా చూస్తే 56 బంతుల్లో 109పరుగులు చేసి వెనుతిరిగాడు. అంతేకాదు ఈ మ్యాచ్ లో ఒక వికెట్ తీసుకోవడం, అలాగే ఒక క్యాచ్ కూడా పట్టుకున్నాడు. ఇలా ఇప్పటివరకు ఐపిఎల్ చరిత్రలో ఒక్క మ్యాచ్ లో అన్ని ఫీట్స్ ను సాధించిన మొదటి ఆటగాడుగా రికార్డు సృష్టించాడు
Also read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ.. రియాన్ పరాగ్‌కు ఛాన్స్!
ఇక అలాగే ఐదు వికెట్ల హాల్ తో పాటు సెంచరీ చేసిన మొదటి ఆడవాడిగా నిలిచాడు. 2013 ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ పై హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. అలాగే 2012 సీజన్లో అదే జట్టుపై ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఇలా ఐపీఎల్ లో 100 వికెట్లతో పాటు సెంచరీ, 5 వికెట్ల హాల్ ఉండడంతో సరికొత్త రికార్డును సృష్టించాడు సునీల్ నరైన్. ఈయన ఐపిఎల్ లో ఇప్పటివరకు 170 వికెట్స్ పడగొట్టాడు. తాజాగా సెంచరీ చేయడంతో సునీల్ నరైన్ ఇన్ని రికార్డ్స్ ను సొంతం చేసుకున్నాడు. కాకపోతే ఈ మ్యాచ్ కలకత్తా ఓడిపోవడమే అతనికి బాధగా అనిపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత.. సునీల్ కు ఇవేమి ఆనందం ఇవ్వలేదని దానికి కారణం మ్యాచ్ గెలిచి ఉంటే అప్పుడు అవన్నీ బోనస్ గా ఉండేవని ఆయన తెలిపాడు. దీంతో నెటిజెన్స్ సునీల్ పై నువ్వు ఒక స్ఫూర్తిదాయక క్రీడాకారుడివి అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.