Bank Account: చనిపోయిన వ్యక్తి అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా చేయడం ఎలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరణించిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి నగదు ఎలా తీసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. చనిపోయిన వ్యక్తి బంధువులైనా.. తోడ బుట్టిన వాళ్లయినా.. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా నగదును విత్ డ్రా చేస్తే చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరణించిన వారి అకౌంట్ నుంచి డబ్బులు తీసేందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని తప్పకుండా పాటించాల్సిందే. వారికి సంబంధించిన ఏటీఎం మీ దగ్గర ఉన్నా.. దానిని వాడ కూడాదు. ఒక వేళ వాడితే చిక్కుల్లోపడతారన్న విషయం తెలుసుకోవాలి. ఓ వ్యక్తి వృద్ధాప్యం వల్లనో లేక అనుకోని పరిస్థితుల్లో చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏటీఎం ద్వారా నగదు తీసుకుంటారు. కాని అకౌంట్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన డబ్బు ఎలా తీసుకోవాలో తెలియక తికమక పడుతుంటారు.
READ MORE:Navodaya Jobs: నవోదయ విద్యాలయాల్లో భారీగా ఖాళీల భర్తీ.. పూర్తి వివరాలు ఇలా..
Also Read
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
అప్పుడు ఏం చేయాలంటే ఆ వ్యక్తి అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంకు అధికారులను కలవాల్సి ఉంటుంది. సంబంధిత పత్రాలు తీసుకుని రమ్మని అధికారులు చెబుతారు. ఆ కుటుంబం అతని మరణ ధ్రువీకరణ పత్రంతో సహా సంబంధిత పత్రాలను బ్యాంకులో ఇచ్చి.. ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బును పొందడానికి ప్రయత్నిస్తారు. ఫలానా వ్యక్తి మరణించిన తరువాత అతని నుండి డబ్బు విత్‌డ్రా అయ్యిందని తెలిస్తే అది పెద్ద సమస్య కూడా కొన్ని సందర్భాల్లో అవుతుంది. ఇది అనవసరమైన సమస్యలను నివారించడానికి ప్రవేశపెట్టిన పద్ధతి. అకౌంట్ తెరిచినప్పుడు ఒకరు లేదా ఇద్దరిని నామినీలుగా చేర్చుకోవడం జరుగుతుంది. వ్యక్తి మరణానంతరం మరణ ధ్రువీకరణ పత్రంతో పాటుగానామినీలు వారికి ఇచ్చిన కొన్ని సూచనలను పాటించాలి. నామినీలు వారి స్వంత కేవైసీ (KYC) విధానాలను పూర్తి చేయాలి. నామినీ ఐడీ, అడ్రస్ ప్రూఫ్ అన్ని సమర్పించాలి. నామినీ కేవలం డబ్బుకు సంరక్షకుడు మాత్రమే, డబ్బును మరణించిన వారి వారసులకు సమానంగా పంపిణీ చేయాలి. గందరగోళం ఏర్పడితే దానిని చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలి. అదేవిధంగా ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతా తెరిచేటప్పుడు నామినీని పెట్టకపోయినా.. వారి మరణం తర్వాత చట్టబద్ధమైన వారసుల ధ్రువీకరణ పత్రాన్ని, మరణ ధృవీకరణ పత్రానికి జతచేయాలి. వారసులందరూ ఒప్పుకొన్న తర్వాతే మరణించిన వారి బ్యాంకు ఖాతాలోని డబ్బును ఉపయోగించవచ్చు.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!