Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో పెద్ద సినిమాలు వస్తున్నాయంటే చాలు, ప్రేక్షకుల జేబులకు చిల్లు పడటం ఖాయమనే ప్రచారం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపు చుట్టూ గత కొద్ది రోజులుగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే రాబోయే క్రేజీ చిత్రం ‘రణబాలి’ కూడా టికెట్ రేట్లు పెంచబోతోందని, ఇందుకోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు తెగ చక్కర్లు కొట్టాయి. పండుగ వేళ సినిమా చూడాలనుకునే సామాన్య ప్రేక్షకుడికి ఈ వార్త పెద్ద షాకిచ్చింది. ఏపీలో సినిమా టికెట్ ధరలు భారీగా పెరగనున్నాయంటూ జరిగిన ప్రచారంపై మూవీ మేకర్స్ తాజాగా ఘాటుగా స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, అటు తెలంగాణలోనూ ఎలాంటి టికెట్ రేట్ల పెంపు కోసం తాము ప్రభుత్వాలను ఆశ్రయించలేదని అధికారికంగా స్పష్టం చేశారు.
కేవలం హైప్ కోసమో లేదా కొందరు కావాలని సృష్టించిన తప్పుడు ప్రచారమే ఇదని కొట్టిపారేశారు. టికెట్ రేట్లు పెంచి ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేసే ఆలోచన తమకు లేదని యూనిట్ పేర్కొంది. సాధారణ (స్టాండర్డ్) ధరలకే ‘రణబాలి’ థియేటర్లలో ప్రదర్శితమవుతుందని వెల్లడించారు. టికెట్ భారం లేకుండా అందరూ కుటుంబ సమేతంగా వచ్చి పండుగ సీజన్లో అద్భుతమైన సినిమా అనుభూతిని పొందవచ్చని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది. అక్టోబర్ 16న ‘రణబాలి’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటివరకు నడిచిన ఊహాగానాలకు తెరపడటంతో మూవీ లవర్స్‌కు ఇది నిజంగా ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి.
Also Read
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!