Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాలోనూ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ లేదా ఓ ప్రత్యేకమైన ఎపిసోడ్ ఉండడం కామన్. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న “వారణాసి”లో సైతం భారీ సీక్వెన్స్ ఉండబోతోందని సినీ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది. తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ వారణాసి సినిమా కథాంశంపై అదిరిపోయే హింట్స్ ఇచ్చారు.
రామాయణ బ్యాక్‌డ్రాప్.. రాముడు – కుంభకర్ణుడి యుద్ధం?
వారణాసి సినిమా ఈవెంట్లో.. సినిమాలోని 30 నిమిషాల నిడివి భారతదేశ సినిమా ఇండస్ట్రీని షేక్ చూస్తుంది అన్నారు కదా.. మరి మైథాలాజికలా, పొలిటికలా లేదా స్పిరిచువల్ కోణంలో సాగుతుందా? అని ప్రశ్నించగా.. అందుకు విజయేంద్ర ప్రసాద్ అందుకు నవ్వుతూ.. “ఇది రాముడికి, కుంభకర్ణుడికి మధ్య జరిగే యుద్ధం లాంటిది” అని సమాధానమిచ్చారు. అంతేకాకుండా.. ఇదివరకే విడుదలైన టీజర్ గ్లింప్స్ లో కుంభకర్ణుడి లాంటి విజువల్, దానికి ఎదురునిలిచే రాముడి లాంటి హీరో మీకు కనిపించే ఉంటారని అన్నారు. అలాగే ఇందులో ఆంజనేయ స్వామి తోక, దానిపై రథం వెళ్లే సీన్లను కూడా ఆయన ప్రస్తావిస్తూ.. సినిమాలోని మైథాలజీ కనెక్టివిటీపై పరోక్షంగా హింట్ ఇవ్వగానే ఇచ్చేసారు.
Also Read
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
మల్టిపుల్ టైమ్ జోన్స్ (Time Zones):
రాజమౌళి గత చిత్రాలైన ‘మగధీర’, ‘ఈగ’ సినిమాల్లో పునర్జన్మలు లేదా టైమ్ ట్రావెల్ వంటివి ఉన్నప్పటికీ.. మహేష్ బాబుతో చేయబోయే వారణాసి సినిమాలో చాలా లేయర్స్, అలాగే విభిన్నమైన టైమ్ జోన్స్ (Time Zones) ఉండబోతున్నాయా? అని ప్రశ్నించగా.. ‘మగధీర’ కంటే ఎక్కువ కాలాల (టైమ్ పీరియడ్స్) నేపథ్యంలో ఈ కథ ఉండబోతుందని తెలిపారు. అలాగే ఈ నిర్ణయం మీదా లేక రాజమౌళిదా? అని అడగగా.. అందుకు విజయేంద్ర ప్రసాద్ సమయస్ఫూర్తితో.. “దాని గురించి ప్రస్తుతం ఎక్కువగా మాట్లాడకూడదు” అంటూ సున్నితంగా దాటవేశారు. మొత్తంగా ఈ చిన్న హింట్స్ వారణాసి సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతోంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా, మన భారతీయ పురాణాల స్ఫూర్తితో ఈ అడ్వెంచర్ రైడ్ ను జక్కన్న భారీగా ప్లాన్ చేస్తున్నట్లు కనపడుతుంది.
తాజావార్తలు
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..