ఉమ్మడి విశాఖ జిల్లాలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు.. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి..ఏజెన్సీ లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుంటే నగరంలో మాత్రం భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.. ఏజెన్సీలో చలి నుండి విముక్తి పొందేందుకు చలి మంటలు వేసుకుంటుంటే, నగరంలో మాత్రం భానుడి నుండి తప్పించుకునేందుకు ఏసీ లు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు.. ఎండ వేడిమికి ఉక్కపోతకి,వేసవి తరహా వాతావరణం నెలకొనడంతో బయటకు వెళ్లేందుకు జనం భయపడుతున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం. 3 గంటల వరకు పరిస్థితి తీవ్రంగా ఉంటోంది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లేకుండా ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది.. వచ్చే వారం ఈశాన్య రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించవచ్చని ఆయన అంచనా వేశారు. దీని ప్రభావంతో ఆ ప్రాంతంతో పాటు కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read : Israel:100 మంది ఇజ్రాయిల్ పౌరులు, సైనికులను కిడ్నాప్ చేసిన హమాస్.
గతేడాది అక్టోబర్ 29న ఈశాన్య రుతుపవనాలు తమిళనాడులోకి ప్రవేశించాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుండి 4.5 కి.మీ ఎత్తులో తుఫాను సర్క్యులేషన్ ఉందని వాతావరణ కార్యాలయం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, వేడి నుంచి ఉపశమనం పొందేందుకు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్, రుషికొండ, సాగర్‌నగర్, యారాడ బీచ్‌లలో వేలాది మంది ప్రజలు కనిపించారు.
Also Read : Minister Roja : క్రీడాకారుడి కులం, మతం, పార్టీ చూడకుండా సహకరించాలి