NTV Telugu Site icon

CM KCR: రాబోయే ఎన్నికల్లో వంద శాతం మనమే గెలుస్తాం.. దాంట్లో అనుమానమే లేదు

Kcr 1

Kcr 1

CM KCR: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. అందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అంతేకాకుండా గిరిజనులకు పోడు భూములకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అప్పట్లో మంచం పట్టిన మన్యం అని వార్తలు వచ్చేవి కానీ.. ఇప్పుడు అలాంటి సమస్య లేదన్నారు. మరోవైపు 75 కోట్లతో కౌటాల వద్ద వార్ధా నది పై బ్రిడ్జి మంజూరు పత్రాన్ని సీఎం అధికారులకు అందజేశారు. అంతేకాకుండా ఆసిఫాబాద్‌కు ఐటీఐ కూడా మంజూరు చేస్తున్నట్లు.. నాగమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Read Also: Rakul Preeth Singh : ఆ ముద్దు సీన్ లో నటించకుండా ఉండాల్సింది..

మరోవైపు ధరణి పోతే దళారీ రాజ్యం వస్తదని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ధరణి తీస్తాం అంటున్నారని.. అది తీస్తే రైతు బంధు ఎలా అందుతుందని ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్రంలో 24 గంటలు కరెంటు సరఫరా చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా పోడు భూములకు 3 ఫేజ్ కరెంట్ ఇస్తామన్నారు. మరోవైపు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు అక్కడ కూడా అమలు చేయాలని మహారాష్ట్ర రైతులు కోరుతున్నారని.. లేదంటే తెలంగాణలో కలిపేయాలని మహారాష్ట్రలోని వివిధ గ్రామాల సర్పంచులు డిమాండ్‌ చేస్తున్నారని కేసీఆర్ చెప్పారు.

Read Also: Titan: ఐదుగురు ప్రాణాల్ని తీసుకుంది.. అంతలోనే మళ్లీ టైటానిక్ వద్దకు తీసుకెళ్తుందట..

ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలకు రూ.25కోట్లు చొప్పున, జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో వందకు వంద శాతం బీఆర్ఎస్ గెలుస్తుందని.. దాంట్లో అనుమానమే లేదన్నారు సీఎం కేసీఆర్. సభ ముగిసిన అనంతరం.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్ కు బయల్దేరాడు.