రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. తన అందంతో అందరిని ఆకట్టుకుంది.నటనతో కూడా అందరిని మెప్పించింది.తెలుగు లో ఈ అమ్మడు దాదాపుగా నాలుగేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగింది. టాలీవుడ్ లో వచ్చిన పాపులారీటి తో రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.అక్కడ పలు సినిమాలలో నటించి మెప్పించింది..దక్షిణాది ఇండస్ట్రీ లో అగ్ర హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా తన అందంతో అందరికి పిచ్చెక్కిస్తుంది.తాజాగా రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్ లో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనింది. ఆ ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. మీకు సౌత్ ఇండస్ట్రీ లో అవకాశాలు తగ్గిపోడానికి కారణం ఏంటని ఆమె నీ అడగగా రకుల్ ఈవిధంగా క్లారిటీ ఇచ్చింది..
తనకు టాలీవుడ్ లో ఎంతో మంచి ఫేమ్ వచ్చింది. అక్కడే నాకు భారీగా అవకాశాలు కూడా వచ్చాయి.కెరియర్ మంచి పీక్స్ ఉన్న సమయంలోనే నేను ఒక సీనియర్ హీరోతో లిప్ లాక్ సన్నివేశాలలో కూడా నటించాను.ఆ లిప్ లాక్ సన్నివేశాలను ఆడియన్స్ సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయారు. దీంతో ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని ఆమె తెలిపింది.అప్పటినుంచి నాకు సౌత్ ఇండస్ట్రీ లో ఎన్నో అవకాశాలు తగ్గిపోయాయని రకుల్ తెలియజేసింది.. అయితే రకుల్ ప్రీతిసింగ్ చేసిన కామెంట్లు టాలీవుడ్ లో సీనియర్ హీరోగా పేరుపొందిన అక్కినేని నాగార్జున గురించి అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే రకుల్ ప్రీతిసింగ్ కిస్ చేసిన ఆ సీనియర్ హీరో కేవలం నాగార్జున మాత్రమే అని తెలుస్తుంది.నాగార్జున నటించిన మన్మధుడు -2 సినిమాలో ఘటైన రొమాన్స్ తో రెచ్చిపోయింది రకుల్ ప్రీతిసింగ్.ఈ సినిమా తర్వాత ఆమెకి అవకాశాలు చాలానే తగ్గిపోయాయి. ఆ ముద్దు సీన్స్ లో నటించకపోయివుంటే రకుల్ కు వరుసగా అవకాశాలు వచ్చేవని రకుల్ అభిమానులు భావిస్తున్నారు.