NTV Telugu Site icon

MP CM Ramesh: సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేస్తాం.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

Cm Ramesh

Cm Ramesh

MP CM Ramesh: ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో శాసన సభకు వచ్చిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఐదేళ్లుగా ఈ అసెంబ్లీ వైపే రాలేదు.. ఇప్పుడు అతి పెద్ద విజయంతో వచ్చామని.. గత ఐదేళ్ల కాలంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరామని మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు.. రాష్ట్రంలో మద్యం, ఇసుక మాఫియాల మీదే కాకుండా.. చాలా శాఖల్లో అవినీతి భారీ ఎత్తున జరిగిందన్న ఆయన.. విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్లు, పీపీఏల్లో భారీ కుంభకోణాలు జరిగాయన్నారు.. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల కేటాయిపుల్లోనూ అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.. ఇక, సాంఘీక సంక్షేమ శాఖలో కూడా అవినీతి జరిగిందన్న ఆయన.. శాఖల వారీగా అవినీతి ఎక్కడెక్కడ జరిగిందో వెలికి తీయాలన్నారు.. ఇక, గత ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అవినీతిపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌.

Read Also: Air India Airlines : టాటా ఎయిర్‌లైన్ కంపెనీకి మళ్లీ నోటీసు.. 15రోజుల్లో తప్పు సరిదిద్దుకోవాలని సూచన

కాగా, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తొలిసారి అసెంబ్లీ సమావేశమైంది.. ఈ రోజు, రేపు.. రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు.. ఇక, సభలో మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆ తర్వాత మంత్రులు.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రమాణం చేయగా.. మిగతా సభ్యులతో అక్షర క్రమంలో ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి..