Site icon NTV Telugu

Pat Cummins: మా దేశంలో కంటే ఇండియాలోనే ఎక్కువ ఆడాం.. ఇక్కడి పిచ్లు గురించి తెలుసు

Cummins

Cummins

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రేపటి మ్యాచ్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించారు. అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలలో తమ దేశంలో కంటే భారతదేశంలో ఎక్కువ వైట్ బాల్ క్రికెట్ ఆడామని, దాని వల్ల ఇక్కడి పిచ్ పరిస్థితులు తనకు బాగా తెలుసన్నారు. అంతేకాకుండా.. గత కొన్నేళ్లుగా భారత్‌పై మేం మంచి క్రికెట్ ఆడుతున్నామని. 1980, 1990, 2000ల ప్రారంభంలో ప్రపంచ కప్ విజయాల క్రెడిట్ తీసుకోలేమని తెలిపాడు.

Vegetarian: శాకాహారులుగా ఉండటానికి మన డీఎన్ఏ కారణమా..?

ఇదిలా ఉంటే.. కమ్మిన్స్ కెప్టెన్‌గా తన మొదటి ODI ప్రపంచకప్‌ను ఆడుతున్నాడు. ఇది అతనికి ఎంతో ప్రత్యేకమైనది. అంతేకాకుండా ఆతిథ్య జట్టుకే ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని.. ఇది కొత్తేమీ కాదన్నాడు. అలాంటి సమయంలో ఆతిథ్య జట్టుతో కొంత కష్టంగా ఉంటుందని.. ఎందుకంటే తమ జట్టును ఉత్సాహపరుస్తారని చెప్పాడు. ఏదేమైనప్పటికీ తమ జట్టు బలంగా ఉందని.. ప్రత్యర్థి జట్లకు మంచి పోటీనిస్తామని అన్నాడు.

Fire Accident: బెంగళూరులోని బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

ప్రపంచకప్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

ఆస్ట్రేలియా జట్టు: 
పాట్ కమిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్‌చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, కెమెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, సీన్ అబాట్, ట్రావిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్.

Exit mobile version