ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన హామీలు అమలు చేయడం లేదంటూ గుడ్డిగా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 3000 పెన్షన్ రూ. 4000 చేశామని తెలిపారు. అన్న క్యాంటీన్లు పెట్టామని.. మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో ముందే అకౌంట్ లో డబ్బులు వేసేస్తామని స్పష్టం చేశారు.